Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2022: అమరనాథ్ యాత్రలో శివుడు ఇష్టమైన వస్తువులను త్యాగం చేసిన ప్రదేశాలు.. ప్రధాన విరామ ప్రాంతాలు

హిందూ పురాణాల ప్రకారం తన భార్య పార్వతీ దేవి కి ఈ గుహ దగ్గరే జీవితం గురించి వివరించాడని ప్రతీతి. ఐతే పార్వతి దేవికి మనిషి జీవితం గురించి చెప్పడానికి.. శివుడు తనకు ఇష్టమైన వస్తువులన్నింటినీ మార్గమధ్యలో విడిచిపెట్టాడట.

Amarnath Yatra 2022: అమరనాథ్ యాత్రలో శివుడు ఇష్టమైన వస్తువులను త్యాగం చేసిన ప్రదేశాలు.. ప్రధాన విరామ  ప్రాంతాలు
Amarnath Yatra 2022
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2022 | 8:24 AM

Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగనుంది.  మంచు రూపంలో దర్శనం ఇచ్చే శివయ్యను చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది అమర్‌నాథ్ యాత్రకు వెళ్తుంటారు.  జలరూపంలో ఉన్న శివుడిని దర్శించుకోవడానికి భక్తులుఅత్యంత శ్రమ కోర్చీ ఈ పుణ్యక్షేత్రానికి వస్తారు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ ధామ్ చరిత్ర శతాబ్దాల నాటిది. అమర్‌నాథ్ ధామ్‌లోని గుహలో కూర్చుని శివుడు పార్వతి తల్లికి అమరత్వం రహస్యాన్ని చెప్పాడని హిందూపురాణాల కథనం. ఈ గుహ దగ్గరే మనిషి జీవితం గురించి  చెప్పడానికి.. శివుడు తనకు ఇష్టమైన వస్తువులన్నింటినీ విడిచిపెట్టాడట. అనంతరం శివుడు పార్వతితో గుహలోకి ప్రవేశించాడు. పరమశివుడు ప్రియమైన వస్తువులను విడిచిపెట్టిన ప్రదేశాలు, నేడు ఆ ప్రదేశాలు అమర్‌నాథ్ యాత్ర ప్రధాన విరామాలు. ఈరోజు ఆ నాలుగు దశల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

పహల్గం: శివుడు ఏకాంత ప్రదేశం కోసం వెతుకుతున్నప్పుడు..  మొదట నందిని ఒక ప్రదేశంలో విడిచిపెట్టాడని చెబుతారు. నేడు ఆ ప్రదేశం పహల్గంగా ప్రసిద్ధి చెందింది. పహల్గాం అనేది అమర్‌నాథ్ పవిత్ర గుహకు వార్షిక యాత్ర ప్రారంభ స్థానం. ఈ ప్రదేశం నుండి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది.

చందన్ వారి శివుడు మరి కొంత దూరం వెళ్లిన తర్వాత చంద్రుని తల నుంచి వేరు చేశాడు. ఈ ప్రదేశాన్ని చందన్ వారి అంటారు. ఈ ప్రదేశంలోని ఆణువణువూ పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో శివుడు తన శరీరంలోనివిభూతి, గంధాన్ని తొలగించాడని నమ్ముతారు. ఇక్కడి మట్టిని ప్రజలు తలపై పవిత్రంగా ధరిస్తారు.

ఇవి కూడా చదవండి

శేష్ నాగ్ సరస్సు ఈ ప్రదేశంలో శివుడు తన మెడలోని పామును తొలగించాడని చెబుతారు. అందువల్ల ఈ ప్రదేశం శేషనాగ్‌కు అంకితం చేయబడింది. ఇక్కడ ఒక సరస్సు ఉంది. ఇందులో శేష్ నాగ్ నివాసం ఉంటాడని భావిస్తున్నారు. ఈ సరస్సును చూసేవారికి మిగిలిన సర్పాలు తమ పడగను విప్పి ఇక్కడ కూర్చున్నట్లు అనిపిస్తుంది.

మహాగుణ పర్వతం శేషనాగ్ సరస్సు తరువాత మహాగుణ పర్వతం వస్తుంది. శివుడు తన కొడుకు వినాయకుడిని కూర్చోబెట్టుకుని వెళ్ళిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని గణేష్ టాప్ అని కూడా అంటారు. ఈ ప్రదేశం చాలా అందంగా, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉంటుందని చెబుతారు. ఈ ప్రదేశాన్ని మహాగణేష్ పర్వతం అని కూడా అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎయిర్‌టెల్‌లో ప్రభుత్వానికి వాటా ఉంటుందా? ఆ కంపెనీ డిమాండ్‌ ఏంటి?
ఎయిర్‌టెల్‌లో ప్రభుత్వానికి వాటా ఉంటుందా? ఆ కంపెనీ డిమాండ్‌ ఏంటి?
ఇది నిజంగా అందమైన ఫ్రీవెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. నెటిజన్లు ఫిదా..!
ఇది నిజంగా అందమైన ఫ్రీవెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. నెటిజన్లు ఫిదా..!
స్కూల్‌ విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు..తర్వాత ఏం జరిగిందంటే!
స్కూల్‌ విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు..తర్వాత ఏం జరిగిందంటే!
కాళ్లు చెప్పే గుండె జబ్బు సంకేతాలివి.. వీటిని నిర్లక్ష్యం చేయకండి
కాళ్లు చెప్పే గుండె జబ్బు సంకేతాలివి.. వీటిని నిర్లక్ష్యం చేయకండి
భారత ప్రధాని మోదీని అభినందిస్తున్నాను: పాక్ క్రికెటర్
భారత ప్రధాని మోదీని అభినందిస్తున్నాను: పాక్ క్రికెటర్
ఇదేం పోయే కాలం.. నాగుపాముతో పరాచకమా.?
ఇదేం పోయే కాలం.. నాగుపాముతో పరాచకమా.?
Viral Video: బ్లూ డ్రమ్‌ గిఫ్ట్‌గా ఇవ్వడంతో వరుడు షాక్...
Viral Video: బ్లూ డ్రమ్‌ గిఫ్ట్‌గా ఇవ్వడంతో వరుడు షాక్...
వాడు నా ఫస్ట్ ఫ్రెండ్.. అయినా నా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు..
వాడు నా ఫస్ట్ ఫ్రెండ్.. అయినా నా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు..
పతంజలి యాగ చికిత్సతో మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు నయం
పతంజలి యాగ చికిత్సతో మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు నయం
వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండు ఇది..! ఎక్కడ కనిపించినా
వేసవిలో తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన పండు ఇది..! ఎక్కడ కనిపించినా