Viral Video: ఓయమ్మో ఇంత చిన్న వయసులో ఎంత ట్యాలెంటో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్న చిన్నారి
చిన్నారులు ఎంత తెలివైన వారో మనందరికీ తెలిసిందే. వారికి ఏదైనా చిన్న విషయం నేర్పినా వెంటనే నేర్చేసుకుంటారు. ఇలా ప్రతిభ కలిగిన పిల్లలు చాలా మందే ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. డ్యాన్స్ చేయడం, పాటలు...
చిన్నారులు ఎంత తెలివైన వారో మనందరికీ తెలిసిందే. వారికి ఏదైనా చిన్న విషయం నేర్పినా వెంటనే నేర్చేసుకుంటారు. ఇలా ప్రతిభ కలిగిన పిల్లలు చాలా మందే ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, కథలు చెప్పడం ఏదో ఒకటి చేసి విశేషంగా నెటిజన్లను ఆకర్షిస్తారు. వీళ్లు చేసే వీడియోలు కొన్ని విభిన్నంగా, మరికొన్ని ఫన్నీగా, ఇంకొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి వీడియోలను మనం చూస్తూనే ఉండిపోతాం. ప్రస్తుతం ఓ చిన్నారి చేస్తున్న డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చిన్నారి చేసిన డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు. ఓ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై బాలిక డ్యాన్స్ చేస్తుంది. 90ల నాటి హిందీ పాట అయిన పగ్లీ-పాగ్లీ, కభీ తునే సోచా పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
ఈ వీడియో Instagram వేదికగా పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 61 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతే కాదు ఆ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో, ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం తాము చూసిన అత్యుత్తమ నృత్య ప్రదర్శన ఇది అని, ఆమె డ్యాన్స్ కాంపిటీషన్ కు వెళ్తే కచ్చింగా కప్పు కొట్టేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.