No Walls Hotel: రెండు వైపులా ల్యాంప్స్.. అంతేగా.. ‘చుక్కలు’ చూపించే హోటల్..!
ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం... గ్రాండ్ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం... 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం.
ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం… గ్రాండ్ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం… 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్. దాని పేరు నల్ స్టెర్న్ హోటల్. దీని ప్రత్యేకత ఏంటంటే… ఒక ప్లాట్‌ఫామ్ మీద డబుల్ కాట్ బెడ్, అటూఇటూ ల్యాంప్స్.అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండదు. హోటలియర్ డానియేల్ కార్బొనియెర్ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్ ఆర్టిస్టులు ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్‌ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు…’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్ బ్రదర్స్.ఇక హోటల్‌లో ఒక నైట్ స్టే చేయాలంటే.. దాదాపు 27 వేల రూపాయలు చెల్లించాలి. డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ పక్కన, ఇంకోటి వైన్‌యార్డ్‌లో, మరోదాన్ని కొండ పక్కన ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

