US President: టెలీప్రామ్టర్‌లో వచ్చింది వచ్చినట్టుగా చదివేసిన బైడెన్‌.. అమెరికా అధ్యక్షుడిని ఆటాడేసుకుంటున్న నెటిజన్లు

Jyothi Gadda

Jyothi Gadda | Edited By: Janardhan Veluru

Updated on: Jul 09, 2022 | 2:05 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి తడబడ్డారు. దీంతో మళ్లీ ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు బైడెన్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు.

US President: టెలీప్రామ్టర్‌లో వచ్చింది వచ్చినట్టుగా చదివేసిన బైడెన్‌.. అమెరికా అధ్యక్షుడిని ఆటాడేసుకుంటున్న నెటిజన్లు
Joe Biden

Follow us on

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి తడబడ్డారు. టెలీప్రామ్టర్‌లో చూస్తూ ప్రసంగించిన  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. పొరపాటున టెలీప్రామ్టర్‌ సూచనను లైవ్‌లో చదివేశారు. ఈ సంఘటన శుక్రవారం టెలివిజన్‌ ప్రసంగం సందర్భంగా జరిగింది. దీంతో మళ్లీ  బైడెన్ కు సంబంధించిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అంతేసంగతి.. నెటిజన్లు బైడెన్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇంతకీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్‌ ఏంటంటే..

ప్రముఖ నేతలు ప్రసంగాలకు టెలీప్రామ్టర్లు వాడుతుంటారని చాలా మందికి తెలియదు. అలా టెలీప్రామ్టర్‌లో చూస్తూ ప్రసంగించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దొరికిపోయారు. పొరపాటున టెలీప్రామ్టర్‌ సూచనను లైవ్‌లో చదివేశారు. ‘ఎండ్‌ ఆఫ్‌ కోట్‌, రిపీట్‌ ది లైన్‌’ అనే సూచనను లైవ్‌లో గట్టిగా పైకి చదివేశారు బైడెన్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత టెలీప్రామ్టర్‌లో చూస్తూ చదివేందుకు బైడెన్‌ కాస్త ఇబ్బందిపడినట్లు కనిపించినా.. తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లైవ్‌లో తడబడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనే పలుమార్లు తప్పుగా ఉచ్చరించి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం అమెరికా పేరును పలకడంలో తడబాటుకు గురయ్యారు. ఇక తాజగా దొరికిన ఈ వీడియోతో నెటిజన్లకు మంచి ఫన్నీ స్టవ్‌ దొరికినట్టయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu