Hyderabad: మారేడ్‌పల్లి సీఐపై కేసు నమోదు.. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి సంచలన విషయాలు..!
ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సి ఐ గా డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో ఓ సిఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయాడు మారేడ్ పల్లి సిఐ నాగేశ్వరరావు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సి ఐ గా డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న రాత్రి ఆ సీఐని వనస్థలిపురం పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. విచారణ అనంతరం సీఐ నాగేశ్వర రావును విధుల నుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సదరు సిఐ పై అత్యాచారం అత్యాయత్నం ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేసి రిమాండ్ పంపినట్టు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధితురాలు, ఆమె భర్త వెంకకటేశ్వర కాలనీ హస్తినాపురంలో నివాసముంటున్నారు. జులై ఏడవ తారీఖు రాత్రి 12 గంటలకు ఇన్స్పెక్టర్ తనపై అత్యాచారం జరిపినట్లు బాధితురాలు ఆరోపించింది. అడ్డు వచ్చిన తన భర్త తల పగలగొట్టాడని ఆ తర్వాత తమ ఇద్దరినీ చంపేందుకు పోలీసు వాహనంలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నంలో కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో తమ ప్రాణాలు దక్కాయని బాధితురాలు ఫిర్యాదు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. బంజారా హిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో ఎంపీ టీజీ వెంకటేష్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చేందుకు 25 లక్షలు లంచం తీసుకున్నట్లు నాగేశ్వరరావు పై ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి