AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Rains Alert: సిటీలో మరికొన్ని గంటలు వర్షం.. అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు బయటకు వెళ్లవద్దంటూ హెచ్చరిక

గ్రేటర్ పరిధిలో వర్షం నీరు నిలిచే 211 ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో మోటర్ల ద్వారా నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేశారు. 

Hyderabad Rains Alert:  సిటీలో మరికొన్ని గంటలు వర్షం.. అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు బయటకు వెళ్లవద్దంటూ హెచ్చరిక
Hyderabad Heavy Rains
Surya Kala
|

Updated on: Jul 09, 2022 | 2:29 PM

Share

Hyderabad Rains Alert: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, కొత్తపేట, మలక్ పేట్, నాగోలు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, కూకట్ పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాళాలు పొంగిపొర్లు తున్నాయి. దీంతో  అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దని నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.  గ్రేటర్ పరిధిలో వర్షం నీరు నిలిచే 211 ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో మోటర్ల ద్వారా నీటిని తోడేందుకు ఏర్పాట్లు చేశారు.

ముఖ్యంగా నగరంలో చాలా ప్రాంతాలలో ఫైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతాల్లోని తాజా పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టిపెట్టారు. SNDP పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. GHMC ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా.. సహాయం కోసం GHMC కంట్రోల్ రూమ్ నెంబర్ 040-2111111కి ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నారు.

నీరు పారుదల కోసం మ్యాన్ హోల్ మూతలు తెరవద్దని జలమండలి హెచ్చరిస్తోంది. మ్యాన్ హోల్ మూతలు విరిగినా, తెరచి ఉన్నా సమాచారం ఇవ్వాలన్న వాటర్ బోర్డు జలమండలి నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అందుకోసం కస్టమర్ కేర్ నెంబర్ 155313న ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో మాన్ సూన్ టీమ్స్, డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..