BJP National Executive Meet: బీజేపీ దిగ్గజాలకు తెలంగాణ వంటల రుచి చూపించబోతున్న యాదమ్మ.. 50 రకాల వంటకాలతో మెనూ
బీజేపీ దిగ్గజాలు నేడు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలతో ప్రముఖులంతా విందు ఆరగించనున్నారు
BJP National Executive Meet: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు బీజేపీ దిగ్గజాలు నేడు తెలంగాణ వంటకాల రుచి చూడబోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ చేతితో చేసిన వంటకాలతో ప్రముఖులంతా విందు ఆరగించనున్నారు. భోజనంతోపాటు స్నాక్స్ సైతం తెలంగాణ స్టయిల్ లోనే తయారు చేస్తున్నారు. స్వీట్స్ సైతం తెలంగాణ తినుబండారాలనే వడ్డిస్తుండటం విశేషం.
వంటల విషయానికొస్తే: స్వీట్స్ సహా దాదాపు 50 రకాల వంటకాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు రోజైన ఆదివారం మధ్యాహ్నం అతిరథ మహారథుల కోసం సిద్ధం చేస్తున్నారు. అవన్నీ స్వయంగా యాదమ్మ చేతితోనే చేస్తుండటం గమనార్హం.
కూరల్లో రకాలు:
చిక్కుడుకాయ టమోటా, ఆలు కూర్మ, వంకాయ మసాల, దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై, బెండకాయ జీడిపప్పు పల్లీల ఫ్రై, తోటకూర టమోటా ఫ్రై, బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై, మెంతికూర పెసరపప్పు ఫ్రై, గంగవాయిలకూర మామిడికాయ పప్పు, సాంబారు, ముద్దపప్పు, పచ్చిపులుసు, బగార, పులిహోర, పుదీన రైస్, వైట్ రైస్, పెరుగన్నం, గోంగూరు పచ్చిడి, దోసకాయ ఆవ చట్నీ, టమోటా చట్నీ, సొరకాయ చట్నీ
స్వీట్స్ లో రకాలు: బెల్లం పరమాన్నం, సేమియా పాయసం, బొబ్బట్లు(భక్షాలు), బూరెలు, అరిసెలు
స్నాక్స్: పెసరపప్పు గారెలు, సకినాలు, మక్క గుడాలు, సర్వపిండి, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, పచ్చి కొబ్బరి చట్నీ, మిర్చి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..