- Telugu News Photo Gallery Viral photos Veg Biryani For 10 Rupees In Hyderabad, Know about The Cheapest Biryani places
Hyderabad: రూ. 10లకే బిర్యాని.. పేదవారి ఆకలి తీరుస్తున్న రుచికరమైన చౌకైన బిర్యాని.. ఎక్కడ లభిస్తుందంటే
Rs.10 Veg Biryani: రోజు రోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి.. ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఇక చాలా మంది ఫుడ్ బిజినెస్ వారు.. ధరలకు తగిన విధంగా తమ ఆహారపు ధరలను పెంచుతున్నారు. అయితే హైదరాబాద్ లో రుచికరమైన వెజ్ బిర్యానీ కేవలం రూ.10 లకే దొరుకుతుందని మీకు తెలుసా..
Updated on: Jun 25, 2022 | 9:17 PM

హైదరాబాద్ వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ లో అన్ని రకాలు దొరుకుతాయి. ఇలా స్ట్రీట్ ఫుడ్ అంటే అమితాసక్తిని చూపించే ఆహారప్రియులకు రూ. 10 బిర్యానీ గురించి ఎప్పుడో తెలిసే ఉంటుంది

10 సంవత్సరాల క్రితం ఇఫ్తికర్ మోమిన్ ఈ ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసాడు. మొదట్లో ఇంకా చౌకగా రూ. 5 కే వెజ్ బిర్యానీని ఇచ్చేవారు. అయితే రోజు రోజుకీ ధరలు పెరిగేసరికి రూ. 10 చేసారు. ఇప్పటికి కూడా రూ. 10 రేటుతోనే కస్టమర్స్ కు వెజ్ బిర్యానీని అందిస్తున్నారు.

హైదరాబాద్‌లో నాలుగు ప్రదేశాల్లో ఈ రూ. 10 వెజ్ బిర్యానీ దొరుకుతుంది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, కోటి మహిళా కళాశాల బస్టాప్, GPO అబిడ్స్ బస్టాప్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ 10 వెజ్ బిర్యానీ దొరుకుతుంది. ఈ ఏరియాల్లో రోజువారీ కూలీ కార్మికులు నుంచి వీధిలో పేదల వరకు అందరు ఈ బిర్యానీ స్టాల్స్ దగ్గర క్యూ కడతారు. పది రూపాయలకు మంచి టేస్టీ టీ కూడా రాని ఈరోజుల్లో ఏకంగా రుచికరమైన వెజ్ బిర్యానీని తినేసి.. రోజు గడిపేస్తారు.

ఇంత తక్కువ ధరకే వెజ్ బిర్యానీ అంటే.. ఏముంటుందిలే.. అనుకోవద్దు.. ఈ బిర్యానీలో.. బఠానీలు, క్యారెట్, బంగాళదుంప, టొమాటో, మెంతికూర ఇలా రుచికరమైన ఆహారపదార్ధాలు అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ స్టాల్స్ లో కేవలం.. రూ. 10 వెజ్ బిర్యానీ మాత్రమే కాదు.. రూ. 30 కి మరియు రూ. 60 కి అర కేజీ బిర్యానీ ని కూడా సర్వ్ చేస్తారు. ఇంటికి తీసుకుని వెళ్ళడానికి పార్సిల్ సర్వీస్ ని కూడా ఇస్తున్నారు. ప్రతిరోజూ దాదాపు 1500 ప్లేట్లు అమ్ముడవుతాయి. ప్లేట్‌కి కేవలం రూ. 1 మార్జిన్ వస్తుంది. రోజూ నాలుగు పెద్ద కంటైనర్లలో 60 కేజీల బిర్యానీ తయారుచేస్తారు.

ఇఫ్తేకర్ సోదరుడు అసద్ మాట్లాడుతూ “మొదటిలో ఈ ఏరియాలో సరసమైన ధరకు మంచి ఆహారం లభించలేదు. దీంతో తన అన్న ఇఫ్తేకర్ నిరుపేదలు, పేద వాళ్ల ఆకలి తీర్చాలని అలోచించి.. ఈ ప్లేస్‌లో స్టాల్ స్టార్ట్ చేశారని చెప్పాడు. ఆకలి అందరిదీ ఒకటే.. అన్న ఉద్దేశ్యంతో తాము లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ తక్కువ ధరకే వెజ్ బిర్యానీని అందిస్తున్నామని తెలిపారు.
