- Telugu News Photo Gallery Childhood Mental Health: teach these things to children from 5 to 10 years
Mental Health: 5 – 10 యేళ్ల పిల్లలకు ఈ అలవాట్లు నేర్పిస్తున్నారా..? మంచి ప్రవర్తనకు పునాదులివే..
పిల్లల మానసిక వికాసానికి తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. పిల్లలకు మంచి మానసిక ఆరోగ్యం అందించాలంటే 5 నుంచి 10 సంవత్సరాల మధ్య కొన్ని ముఖ్యమైన అలవాట్లు నేర్పించాలి. అవేంటో తెలుసుకుందాం..
Updated on: Jun 26, 2022 | 9:26 AM

పిల్లల మానసిక వికాసానికి తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది. పిల్లలకు మంచి మానసిక ఆరోగ్యం అందించాలంటే 5 నుంచి 10 సంవత్సరాల మధ్య కొన్ని ముఖ్యమైన అలవాట్లు నేర్పించాలి. అవేంటో తెలుసుకుందాం..

ఫిట్‌గా ఉండేందుకు యోగా చేయాలని, యోగా ప్రాముఖ్యత గురించి ముందుగా చెప్పాలి. ఆ తర్వాత రోజూ యోగా చేసేలా అలవాటు చెయ్యాలి. దీంతో మీ పిల్లలు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటారు.

చాలా మంది తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల చదువుపైనే శ్రద్ధ పెడతారు. వారి మానిసికోల్లాసానికి ఆటలు కూడా అవసరమనే విషయం గ్రహించాలి. పిల్లలు ఆటల ద్వారా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉంటారు.

పిల్లల హాబీల్లో మ్యూజిక్, డ్యాన్స్‌లను కూడా చేర్చవచ్చు. పిల్లలపై చదువుల వల్ల కలిగే ఒత్తిడిని దూరం చెయ్యడానికి మ్యూజిక్, డ్యాన్స్‌ను రోజువారీ కార్యకలాపాల్లో భాగం చెస్తే.. పిల్లలు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు.

పిల్లలను గారం చేసే తల్లిదండ్రులు.. వారు చేసే చిన్న చిన్న తప్పులపై శ్రద్ధ పెట్టరు. ఇటువంటి పిల్లలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడూ పరిశుభ్రంగా ఎలాగుండాలో తల్లిదండ్రులు నేర్పాలి. మంచి అలవాట్లు మంచి నడవడికి పునాదులౌతాయి.





























