AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Executive Meeting: భాగ్యనగర్‌ డిక్లరేషన్‌.. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కీలకోపన్యాసం చేయనున్న ప్రధాని మోడీ..

తెలంగాణలో పాగా వేయాలనే ప్రయత్నాలు, దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది బీజేపీ. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివచ్చారు.

BJP Executive Meeting: భాగ్యనగర్‌ డిక్లరేషన్‌.. బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కీలకోపన్యాసం చేయనున్న  ప్రధాని మోడీ..
Bjp
Shaik Madar Saheb
|

Updated on: Jul 03, 2022 | 11:51 AM

Share

PM Modi: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో ఆదివారం రెండో రోజు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4.30 గంటలకు ముగియనున్నాయి. హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాల్లో భాగ్యనగర్‌ డిక్లరేషన్‌ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. నిన్న మొదటి రోజు సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ రాత్రి నొవాటెల్‌లో బస చేశారు. తెలంగాణలో పాగా వేయాలనే ప్రయత్నాలు, దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది బీజేపీ. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. నిన్న తొలి రోజు సమావేశాల్లో పలు కీలకాంశాలపై జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ఈ రోజు జరిగే సమావేశాల్లో భాగ్యనగర్‌ డిక్లరేషన్‌ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. ఈ భారీ బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొని కీలక ఉపన్యాసం చేయనున్నారు.

తొలి రోజు సమావేశం జేపీ నడ్డా అధ్యక్షోపన్యాసంతో ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఏనిమిదేళ్ల పరిపాలనను నడ్డా ప్రశంసించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై చర్చ జరిగింది. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికలు, వచ్చే ఏడాది కర్ణాటక, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యవర్గం చర్చించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్థిక తీర్మానం ప్రవేశపెట్టగా మరో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమర్థించారు. రెండో రోజు సమావేశం రెండు సెషన్లలో సాగనుంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగం మధ్యాహ్నం ఉండే అవకాశం ఉంది. పార్టో బలోపేతానికి ఉద్దేశించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తామని హైదరాబాద్‌ రాగానే మోదీ ట్వీట్‌ చేశారు.

18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. 2004లో కాషాయ పార్టీ ఇక్కడ చివరిసారిగా సమావేశాలు నిర్వహించింది. దీనికి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రస్తుత సమావేశాన్ని బీజేపీ ప్రతష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే, ద‌క్షిణాదిలోని మ‌రికొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగున్నాయి. ఆ త‌ర్వాత వ‌చ్చే ఏడాది లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రోసారి కేంద్రంలో అధికారం ద‌క్కించుకోవాలంటే ద‌క్షిణాది రాష్ట్రాలు కీల‌కం కానున్నాయి. దీంతో బీజేపీ ద‌క్షిణాదిపై ఫోక‌స్ పెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.