Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం.. దిగి వస్తున్న వెండి.. తాజా ధరలు

Gold Price Today: బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక నుంచి ధరలు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం..

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం.. దిగి వస్తున్న వెండి.. తాజా ధరలు
Follow us
Subhash Goud

|

Updated on: Jul 03, 2022 | 6:23 AM

Gold Price Today: బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక నుంచి ధరలు పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై పన్ను శాతం పెంచిన నేపథ్యంలో ధరలు మండిపోయే అవకాశం ఉంది. ఇక తాజాగా దేశీయంగా 10 గ్రాముల ధరపై స్వల్పంగా అంటే.. రూ.150 వరకు పెరిగింది. పసిడి పెరిగితే వెండి తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ.1200 వరకు తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో జూలై 3 (ఆదివారం) ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,920 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280 ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

☛ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ52,400 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 వద్ద ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 వద్ద ఉంది.

☛ కేరళలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,340 ఉంది.

వెండి ధరలు:

చెన్నైలో కిలో వెండి ధర రూ.63,500, ముంబైలో రూ.57,800, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57,800, కోల్‌కతాలో రూ.57,800, బెంగళూరులో రూ.63,500, హైదరాబాద్‌లో రూ.63,500, కేరళలో రూ.63,500, విజయవాడలో రూ.63,500 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి