Reliance Jio: 5G సేవలపై రిలయన్స్ జియో ఫోకస్.. ఆ రెండు కంపెనీలతో కీలక చర్చలు

Reliance Jio: దేశం సాంకేతికంగా ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం దేశంలో 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు..

Reliance Jio: 5G సేవలపై రిలయన్స్ జియో ఫోకస్.. ఆ రెండు కంపెనీలతో కీలక చర్చలు
Follow us

|

Updated on: Jul 01, 2022 | 11:06 AM

Reliance Jio: దేశం సాంకేతికంగా ముందుకు దూసుకుపోతోంది. ప్రస్తుతం దేశంలో 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆయా టెలికం కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ట్రయల్స్‌ కూడా నిర్వహించాయి. 2022 చివరి వరకు భారతదేశంలో 5G టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్మలాసీతారామన్‌ ఇటీవల తెలిపారు. ఇప్పటికే భారతదేశంలోని ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్‌ జియో కొన్ని ప్రాంతాల్లో 5జీ సేవల ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ టెలికం కంపెనీ నోకియా, ఎరిక్సన్‌ వంటి 5G మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీల భాగస్వామ్యంతో మొబైల్‌ టవర్లను కూడా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఇప్పటికే 5G యాక్సెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ జియో తన ప్రస్తుత 4G భాగస్వామి శాంసంగ్‌ను మించి 5జీ టెలికాం గ్రేస్‌లను కొనుగోలు చేయడానికి యూరోపియన్‌ టెలికాంగేర్‌ తయారీ కంపెనీ ఎరిక్సన్‌తో చర్చలు ప్రారంభించింది. టెలికాం గేర్‌ తయారీదారులైన ఎరిక్సన్‌, నోకియాతో చర్చలు ప్రారంభించినట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ నివేదిక తెలిపింది. ఎరిక్సన్‌, జియో మొదట ఢిల్లీలో 5జీ ట్రయల్స్‌ కోసం టైఅప్‌ అయ్యాయి. కొన్ని వారాల కిందట ముంబైలో ట్రయల్స్‌ నిర్వహించడానికి జియో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. జియో కొత్త ప్రదేశాల్లో ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది.

జియో ఇప్పటికే ముంబై, జూమ్‌నగర్‌లలో తన స్వదేశీ 5G పరికరాలను, జామ్‌నగర్‌లో శాంసంగ్‌తో కలిసి ట్రయల్స్‌ నిర్వహించింది. టెల్కో టాప్‌ వెయ్యి నగరాలకు 5జీ నెట్‌వర్క్‌ కవరేజ్‌ ప్లానింగ్‌ పూర్తి చేసిందని, దాని ఫైబర్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుతోందని ఈ ఏడాది జనవరిలో జియో ప్రెసిడెంట్‌ కిరణ్‌ థామస్‌ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి