కప్పు టీ తాగితే రూ.50ల సర్ ఛార్జీ.. బిల్లు చూసి షాకైన ప్రయాణికుడు.. IRCTC నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు..

బిల్లు ఫోటోను షేర్ చేస్తూ, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రూ. 20ల టీకి రూ.50 పన్ను వసూళ్లు చేశారు అంటూ పేర్కొన్నాడు. నా దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా మారిపోయింది అంటూ రాసుకొచ్చాడు

కప్పు టీ తాగితే రూ.50ల సర్ ఛార్జీ.. బిల్లు చూసి షాకైన ప్రయాణికుడు.. IRCTC నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు..
Train
Follow us

|

Updated on: Jul 02, 2022 | 5:52 PM

భారతీయ రైల్వే చౌకైన రవాణా మార్గంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఓ వార్త తెరపైకి వచ్చింది. దీంతో రైల్వే శాఖపై నెటిజన్లు ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. రూ.20 విలువ చేసే టీ కప్పుకు ప్రయాణికుడి నుంచి రూ.70 వసూలు చేయడంతో, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాల్‌గోవింద్ వర్మ అనే వ్యక్తి ఈ బిల్లు ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ, భోపాల్ మధ్య నడుస్తున్న భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న అతను.. ఓ టీ ఆర్డర్ చేశాడు. ఒక కప్పు టీ ఖరీదు రూ.20 అని బిల్లులో పేర్కొన్నారు. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ, టీకి సర్వీస్ ఫీజుగా రూ.50 వసూలు చేయడంతో చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. అంటే ఆ ట్రైన్‌లో ఒక్క టీ తాగాలంటే మొత్తంగా రూ.70ల ఖర్చు చేయాలన్నమాట.

బిల్లును ట్వీట్ చేయడంతో నెట్టింట్లో మొదలైన రచ్చ..

ఇవి కూడా చదవండి

బిల్లు ఫోటోను షేర్ చేస్తూ, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రూ. 20ల టీకి రూ.50 పన్ను వసూళ్లు చేశారు అంటూ పేర్కొన్నాడు. నా దేశ ఆర్థిక వ్యవస్థ నిజంగా మారిపోయింది అంటూ రాసుకొచ్చాడు.

కాగా, రూ.50లు పన్ను కాదని సర్వీస్ ఛార్జీ అంటూ నెటిజన్లు ఆ యూజర్‌కి బదులిచ్చారు. అయితే సర్వీస్ ఛార్జీని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోవచ్చు. కానీ, 2018 సంవత్సరంలో భారతీయ రైల్వే జారీ చేసిన సర్క్యులర్‌లో, ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ చేసేటప్పుడు ప్రయాణీకులు ఆహారం బుక్ చేసుకోకపోతే, రూ. 50 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

తిండికి అయ్యే ఖర్చు టికెట్ ఛార్జీలో..

ఇంతకు ముందు శతాబ్ది, రాజధాని వంటి రైళ్లలో టికెట్ చార్జీలో భోజన ఖర్చు కూడా ఉండేది. అయితే, దీని తరువాత, ప్రయాణీకులు వారి ప్రయాణానికి ప్రత్యేక భోజనాన్ని బుక్ చేసుకునే అవకాశం ఇచ్చారు.

టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో క్యాటరింగ్‌ సర్వీస్‌ను ఎంచుకోని ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారం కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, మైలుకు రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సర్క్యులర్‌లో పేర్కొంది. ఇది భోజనం కోసం నోటిఫైడ్ క్యాటరింగ్ ఛార్జీలకు అదనంగా ఉంటుంది. IRCTC ఆన్ బోర్డ్ సూపర్‌వైజర్ ద్వారా ఛార్జ్ చేస్తుంటారు.

ఇది కాకుండా, పశ్చిమ రైల్వేలోని 300 కంటే ఎక్కువ రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్‌లతో ప్రయాణించే సౌకర్యం జులై 1, 2022 నుంచి పునరుద్ధరించారు. పశ్చిమ రైల్వే జులై 1 నుంచి ఇక్కడి నుండి ప్రారంభమయ్యే అన్ని రైళ్లలో అన్‌రిజర్వ్డ్ రూపంలో రెండవ తరగతి కోచ్‌లను పునరుద్ధరిస్తుంది.

కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
కొవ్వు మంచిదే.. ఈ 4 ఆహారాలు శరీరానికి బ్రహ్మాస్త్రాలు..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
చిన్న సమస్యకే కలత చెందుతున్నారా? మానసికంగా దృఢంగా ఉండాలంటే..
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
డ్రై స్కిన్ కారణంగా వయసు కన్నా ముందుగానే వృద్ధాప్యం..!
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
రిజర్వేషన్లపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. తిలక్‌పై ట్రోల్స్
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
పాటల్లేని విజయ్ సినిమా.. 75 కోట్లు వసూలు చేసిన కేరళలో మూడో సినిమా
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
గతేడాది ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇంకా అవకాశం ఉందా?
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
బాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే: సీఎం జగన్
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!
అణు యుద్ధాన్ని తట్టుకునేలా విమానం.. ప్రత్యేకతలు ఇవే!