AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Congress: షర్మిల పార్టీతో ఆ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కు నష్టం.. దిద్దుబాటు చర్యలపై కాంగ్రెస్ నేతల సమాలోచన

తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ తో పీసీసీ ఇంచార్జ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, వ్యూహకర్త సునీల్ కనుగోలు భేటీ అయ్యారు. ఈ భేటీలో నేతల మధ్య ప్రధానంగా తెలంగాణ లో షర్మిల పార్టీ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది

TS Congress: షర్మిల పార్టీతో ఆ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కు నష్టం.. దిద్దుబాటు చర్యలపై కాంగ్రెస్ నేతల సమాలోచన
Ts Congress Party
Surya Kala
|

Updated on: Jul 09, 2022 | 5:02 PM

Share

TS Congress: తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ప్రముఖ పాత్ర పోషించమని కాంగ్రెస్ నేతలు ప్రజలమధ్యకు వెళ్తున్నా.. రోజు రోజుకీ కాంగ్రెస్ ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో రాజకీయాలు నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల తెలంగాణాలో వైఎస్సార్ టీపీ ని ఏర్పాటు చేసి.. పాదయాత్రతో ప్రజల మధ్య తిరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం తిరిగి తీసుకుని రావడంపై దృష్టి సారిస్తూ భేటీ అయ్యారు.

తెలంగాణ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ తో పీసీసీ ఇంచార్జ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, వ్యూహకర్త సునీల్ కనుగోలు భేటీ అయ్యారు. ఈ భేటీ శుక్రవారం అర్థరాత్రి 12:30 వరకు సాగింది. ఈ భేటీలో నేతల మధ్య ప్రధానంగా తెలంగాణ లో షర్మిల పార్టీ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ కు ఇబ్బందులు ఉంటాయని సునీల్ కనుగోలు రిపోర్ట్ ఇచ్చారు.

ముఖ్యంగా కాంగ్రెస్ బలంగా ఉన్న మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో షర్మిలమ్మ  వైఎస్సార్ టీపీ వలన కాంగ్రెస్ కు నష్టం చేస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ.. వైఎస్సాఆర్ ఓటు బ్యాంకు చీలకుండా ఏం చేయాలనే దానిపై చర్చించారు. అయితే శుక్రవారం రాత్రి మీటింగ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం కోమటిరెడ్డి ఇంట్లో ఠాగూర్ వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ