Best Monsoon Foot Care Tips: వర్షాకాలంలో బయటకువెళ్తున్నారా..? పాదాలు జర జాగ్రత్త..!
వర్షాకాలం ప్రారంభమైతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. పాదాలు తరచుగా వర్షంలో తడిసిపోతాయి. దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా..
అసలే వర్షాకాలం.. ఆపై ప్రతిరోజూ వర్షపు నీటిలో తడుస్తూ విధులకు వెళ్లాల్సిందే. ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా ఉండటం అంటే అది సాధ్యం కాని పని. అందుకే మీ చర్మం జుట్టుతో పాటు, వర్షాకాలంలో పాదాలకు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలం ప్రారంభమైతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. పాదాలు తరచుగా వర్షంలో తడిసిపోతాయి. ఈ సందర్భంలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా రింగ్వార్మ్, దురద సమస్యలు పాదాలను వేధిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- వర్షాకాలంలో బయట తిరిగి వచ్చాక పాదాలు దురదగా అనిపిస్తాయి. అప్పుడు కొద్దిగా నిమ్మ రసం, వెనిగర్ మిక్స్ చేసి దురద ఉన్న చోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
- ప్రతి రోజు రాత్రి తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత కొబ్బరినూనె రాస్తూ, కొద్దిసేపు పాదాలను మర్దన చేస్తే పాదాలపై పేరుకున్న మురికి, క్రిములు తొలగుతాయి.
- వర్షాకాలంలో ప్రతి రోజు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవడం చాలా ఉత్తమం.
- వర్షాకాలంలో పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి.. పాదాలకు ఉన్న మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రుద్దాలి. డెడ్ స్కిన్‌ను తొలగిస్తే పాదాల పగుళ్లు తగ్గుతాయి.
- వేపాకులను పేస్ట్‌లా చేసి ఇక స్పూన్ పసుపు కలిపి పాదాలకు ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాత షాంపూతో రుద్ది కడిగితే పగుళ్ల సమస్య తగ్గిపోతుంది.
- వర్షాకాలంలో తరచూ షూస్ వేసుకోకూడదు. ఎందుకంటే వర్షంలో తడిసినపుడు షూస్‌లో ఉన్న తేమ పాదాలకు ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది.
- రోజ్ వాటర్, గ్లిజరిన్ ఈక్వల్‌గా తీసుకొని రాత్రివేళ పాదాలకు మర్దన చేయాలి. మార్నింగ్ గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి పాదాలను కడిగితే, మురికి సులువుగా తొలగిపోతుంది.
- కాలి గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో కాలి గోళ్ల మధ్య ఇసుక, ధూళి పేరుకుపోతాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
- ఇక డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు పాదాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.
- ఈ సీజన్‌లో పాదాలకు క్రీమ్ రాసుకోవడం అంతమంచిది కాదు.. ఎందుకంటే ఇది తేమను పెంచుతుంది. ఆపై ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్లే ముందు, మీ మడమల చుట్టూ, మీ కాలి మధ్య ప్రాంతంలో యాంటీ ఫంగల్ పౌడర్‌ను చల్లండి. ఇది మీ పాదాలను పొడిగా ఉంచుతుంది. బ్యాక్టీరియా వృద్ధిని నివారిస్తుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి