Viral Video: పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డేంజరస్ స్టంట్లు.. ధూమ్ సినిమాను లైవ్‌లో చూపించాడుగా..
Viral Video: ధూమ్ సిరీస్ సినిమాల్లో దొంగలు అదేనండి మన హీరోలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన బిల్డింగులు, వాహనాలపై నుంచి దూకడం మనం చూసే ఉంటాం. అది సినిమాల్లో కాబట్టి సరిపోయింది..
Viral Video: ధూమ్ సిరీస్ సినిమాల్లో దొంగలు అదేనండి మన హీరోలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తైన బిల్డింగులు, వాహనాలపై నుంచి దూకడం మనం చూసే ఉంటాం. అది సినిమాల్లో కాబట్టి సరిపోయింది. నిజ జీవితంలో అలా దూకితే మాత్రం దెబ్బలేంటి ఒక్కోసారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. అయితే ఓ యువకుడు మాత్రం ఇవేవీ ఆలోచించలేదు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ధూమ్ సిరీస్ సినిమాల్లోలాగే డేంజరస్ స్టంట్లు చేశాడు. ఎత్తైన బిల్డింగ్‌పై నుంచి అమాంతం దూకేశాడు. అమెరికాలోని బ్రూక్లిన్ నగరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈక్రమంలో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కెండాల్ ఫ్లాయిడ్ అనే యువకుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేశాడు. ఈ విషయం గమనించిన పోలీసులు అతనిని అడ్డుకున్నారు. పోలీసులుమాట్లాడేలోపే కారులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. ఒక అధికారి ముక్కు పగిలేలా గుద్దాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలోనే ఒక సబ్‌వే ట్రాక్ ఎక్కేసి, అక్కడి నుంచి రోడ్డుపై ఉన్న ఒక బిల్డింగ్ పైకి దూకాడు.
యువకుడు బిల్డింగ్‌పై దూకేందుకు ప్రయత్నిస్తుంటే.. రోడ్డుపై ఉన్న పోలీసులు, జనాలు కేకలు వేస్తూ, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ల మాటలు వినిపించుకోకుండా కెండాల్ దూకేశాడు. ఈ క్రమంలోనే కాలుకు దెబ్బ తగిలింది. ధూమ్ సినిమాలో హీరో తప్పించుకున్నాడేమో కానీ ఇక్కడ మాత్రం దూకిన కాసేపటికే పోలీసులకు దొరికిపోయాడు కెండాల్. పోలీసుపై దాడి చేయడం, సీట్ బెల్టు లేకుండా డ్రైవ్ చేయడం వంటి కేసులు ఆ యువకునిపై పెట్టారు. ప్రస్తుతం కెండాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం బాగానే ఉందని వారు చెబుతున్నారు. అయితే ఆ యువకుడు పోలీసులకు పట్టుబడినా అతను చేసిన స్టంట్ మాత్రం సాహసమే అని చెప్పుకోవాలి. దీనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.
#Subway #Jumper @MTA suspect fleeing #NYPD. pic.twitter.com/a5xsiqyIWr
— Isaac Abraham (@IsaacAb13111035) July 7, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..