Alia Bhatt: మా ఇద్దరి మధ్య ప్రేమకు అప్పుడే పునాది పడింది.. తొలి ప్రేమ ముచ్చట్లను పంచుకున్న అలియా భట్‌..

Alia Bhatt- Ranbir kapoor: ఏడేళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల బంధంగా మార్చుకుంటూ ఘనంగా పెళ్లిపీటలెక్కారు అలియా భట్‌ (Alia Bhatt), రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir kapoor). ఏప్రిల్‌14న ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వీరి వివాహం వేడుకగా జరిగింది. ..

Alia Bhatt: మా ఇద్దరి మధ్య ప్రేమకు అప్పుడే పునాది పడింది.. తొలి ప్రేమ ముచ్చట్లను పంచుకున్న అలియా భట్‌..
Alia Bhatt Ranbir Kapoor
Follow us
Basha Shek

|

Updated on: Jul 08, 2022 | 2:05 PM

Alia Bhatt- Ranbir kapoor: ఏడేళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల బంధంగా మార్చుకుంటూ ఘనంగా పెళ్లిపీటలెక్కారు అలియా భట్‌ (Alia Bhatt), రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir kapoor). ఏప్రిల్‌14న ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇదిలా ఉంటే పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించి తన ఫ్యాన్స్‌కు శుభవార్తను అందించింది అలియా. కాగా బ్రహ్మస్త్ర సినిమాలో తప్పితే అంతకుముందు అలియా, రణ్‌బీర్‌లు ఏ సినిమాలోనూ జంటగా నటించలేదు. మరి వీరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది. అది ఎలా ప్రేమగా వికసించింది? అన్న సందేహాలు చాలామందికి కలిగాయి. అయితే తాజాగా ఓ షో పాల్గొన్న రణ్‌బీర్‌ తో తమ ప్రేమ ఎక్కడ ఎప్పుడు మొదలైందనే దానిపై నోరు విప్పింది అలియా. కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘ కాఫీ విత్‌ కరణ్‌ జోహార్‌’ 7వ సీజన్‌లో పాల్గొన్న ఆమె తన లవ్‌, మ్యారేజ్‌ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఛాట్‌షోలో మరో స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ కూడా పాల్గొన్నాడు.

ఆ విమానంలో సీటు సరిగా లేదని..

చిన్నప్పటి నుంచే రణ్‌బీర్‌ అంటే క్రష్‌. అయితే మేమిద్దరం కలిసి పెద్దగా సినిమాలు చేయలేదు. బ్రహ్మస్త్రం షూటింగ్‌ సమయంలోనే మా ఇద్దరి మధ్య ప్రేమ బలపడింది. ఈ సినిమా షూటింగ్‌ కోసం మేము ఒకే విమానంలో ప్రయాణిస్తున్నాం. అప్పుడు రణ్‌బీర్‌ సీటు సరిగా లేదు. దీంతో నా పక్కన వచ్చి కుర్చున్నాడు. అప్పుడు మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకరి అభిప్రాయలను మరొకరు పంచుకున్నాం. దీంతో అప్పుడే నిర్ణయించుకున్నాం. మా ఈ లాంగ్‌ రిలేషన్‌షిప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్‌ అయ్యాం. మేం అంతకు ముందేప్పుడు నేరుగా ఒకరికొకరు ప్రపోజ్‌ చేసుకోలేదు. అయితే ఒకరిపై ఒకరు ఇష్టంతో ఉన్నాం’ అని చెప్పుకొచ్చింది అలియా. కాగా ఈ రియల్‌ కపుల్‌ జంటగా నటించిన మొదటి చిత్రం బ్రహ్మస్త్రం. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్‌ 9న ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!