Actor Chiyaan Vikram: హీరో విక్రమ్ కు తీవ్ర అస్వస్థత .. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన చియాన్

Actor Chiyaan Vikram: ప్రముఖ నటుడు విక్రమ్ అస్వస్థత కారణంగా శుక్రవారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు.. సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఆసుపత్రి వర్గాల ప్రకారం నటుడు ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Actor Chiyaan Vikram: హీరో విక్రమ్ కు తీవ్ర అస్వస్థత .. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన చియాన్
Vikram
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jul 08, 2022 | 5:09 PM

Actor Chiyaan Vikram: ప్రముఖ నటుడు విక్రమ్ అస్వస్థత కారణంగా శుక్రవారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు.. సన్నిహితుల తెలిపారు. విక్రమ్ ప్రస్తుతం ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలో సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన తన రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ లాంచ్‌లో అగ్ర నటుడు పాల్గొనాల్సి ఉంది.

విక్రమ్ విల‌క్ష‌ణ న‌ట‌న‌కు పెట్టింది పేరు. టాలీవుడ్ లో మొదట్లో క్యారెక్టర్ ఆరిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేసిన విక్రమ్.. కోలీవుడ్ లో అపరిచితుడితో మంచి పేరు ఫేమ్ వచ్చింది. విభిన్న చిత్రాలతో.. సినిమా సినిమాకు కొత్త వేరియేష‌న్ చూపిస్తూ త‌న‌లోని న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తూ. అభిమానులను అలరిస్తుంటాడు. 55 ఏళ్ళు దాటినా విక్రమ్ విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ యంగ్ హీరోల‌కు సైతం పోటీనిస్తున్నాడు.  విక్ర‌మ్ సినిమాల్లో హీరో పాత్ర చాలా వైవిద్యంగా ఉంటుంది.. పాత్రకు అనుగుణంగా తనని తాను మలచుకుంటూ..  అద్భుత న‌ట‌న‌తోనే కాకుండా గెటప్‌ల‌తోనూ ఆక‌ట్టుకుంటాడు.

విక్రమ్ వరస సినిమాలను లైన్ లో పెట్టాడు. మణిరత్నం దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్, కోబ్రా ,  దర్శకుడు పా రంజిత్‌తో కొత్త చిత్రంతో సహా అనేక చిత్రాల్లో నటిస్తున్నాడు. నిర్మాణంలో వివిధ దశల్లో పలు చిత్రాలు ఉన్నాయి. ఇటీవల కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన మహాన్‌లో కనిపించాడు. ఇందులో విక్రమ్ తనయుడు నటుడు ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

విక్రమ్ హీరోగా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన కోబ్రా ఆగష్టు 11న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీనిధి శెట్టి, మిర్నాళిని రవి, KS రవికుమార్ ,మియా జార్జ్ తదితరులు నటిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30 న విడుదల కానుంది. ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, శరత్ కుమార్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే