Actor Naresh: గత కొన్ని రోజులుగా నరేష్ పెళ్లిగోల.. నరేష్ ముగ్గురు భార్యల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్.

మైసూర్ హోట‌ల్లో ఉన్న న‌రేష్‌, ప‌విత్రా లోకేష్‌ల‌ను పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రెడ్ హ్యాండెడ్‌గా ర‌మ్య పట్టుకుంది. ఈ నేపథ్యంలో న‌రేష్ ముగ్గురు భార్య‌లు వార్తల్లో నిలిచారు.. అసలు ముగ్గురు భార్యలు ఎవ‌రు ? వారి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటంటే..

Actor Naresh: గత కొన్ని రోజులుగా నరేష్ పెళ్లిగోల.. నరేష్ ముగ్గురు భార్యల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్.
Actor Naresh Three Wives
Surya Kala

|

Jul 05, 2022 | 10:26 AM

Actor Naresh: గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ పెళ్లి గోల ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. నరేష్ తన సహ నటి పవిత్ర నరేష్ ను నాల్గో పెళ్లి చేసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతుంటే.. నేను ఉన్నానంటూ.. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు నరేష్, పవిత్ర, రమ్య అనే ట్రై యాంగిల్ స్టోరీ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కన్నడ మీడియాను వీరి ప్రేమ, పెళ్లి వార్తలు ఓ రేంజ్ లో కుదిపేస్తోంది.

మైసూర్ హోట‌ల్లో ఉన్న న‌రేష్‌, ప‌విత్రా లోకేష్‌ల‌ను పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో రెడ్ హ్యాండెడ్‌గా ర‌మ్య పట్టుకుంది. ఇక ప‌విత్ర‌ను ఏకంగా చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించింది. తాను తన భర్తకు విడాకులు ఇవ్వనని స్పష్టం చేసింది. తన భర్త నాలుగో పెళ్లిని అడ్డుకుంటానని చెబుతోంది. ఈ నేపథ్యంలో న‌రేష్ ముగ్గురు భార్య‌లు వార్తల్లో నిలిచారు.. అసలు ముగ్గురు భార్యలు ఎవ‌రు ? వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం..

విజయనిర్మల మొదటి భర్తకు కలిగిన సంతానం నరేష్. అయితే విజయనిర్మల తన భర్తకు విడాకులు ఇచ్చి.. సూపర్ స్టార్ కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు. కృష్ణ .. నరేష్ ను ఎప్పుడూ సొంత కుమారుడిగా చూసుకున్నారు.. ఇక నరేష్ తల్లి విజయనిర్మల బాటలో నడుస్తూ.. బాలనటుడిగా పండంటి కాపురం సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు. త‌ర్వాత త‌న త‌ల్లి విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ప్రేమ సంకెళ్లు సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. జంధ్యాల నాలుగు స్తంభాలాట సినిమాతో ఫేమస్ అయ్యాడు. గత 40 ఏళ్లుగా వివిధ పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. బీజేపీలో చేరి.. రాజకీయాల్లో అడుగు పెట్టాడు.

నరేష్ మూడు పెళ్లిళ్ల విషయానికి వస్తే.. మొదటి పెళ్లి.. తల్లి విజయనిర్మల చూసిన సంబంధమే..  సీనియ‌ర్ డ్యాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తెతో న‌రేష్‌కు పెళ్లి జరిగింది. ఈ దంప‌తుల‌కు న‌వీన్ విజ‌య్‌కృష్ణ అనే కుమారుడు ఉన్నారు.  కుమారుడు పుట్టిన తర్వాత నరేష్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. నందిని నర్సింగ్ హోమ్ వంటి సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా సక్సెస్ అందుకోలేదు. నవీన్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ రేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే..

మనస్ప‌ర్థ‌లు రాడంతో మొద‌టి భార్య‌కు విడాకులు  ఇచ్చిన నరేష్.. అనంతరం ప్రముఖ కవి, సినిమా పాటల రచయిత దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌నువ‌రాలు రేఖా సుప్రియ‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు కూడా తేజ అనే  కుమారుడు ఉన్నాడు. నరేష్, సుప్రియ కూడా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి ఇప్పటికీ ఓ ఎన్జీవో సంస్థ కోసం పనిచేస్తూనే ఉన్నట్లు టాక్..

ముచ్చటగా మూడో పెళ్లి నరేష్ 50 ఏళ్ళు దాటిన అనంతరం.. తనకంటే దాదాపు 20 ఏళ్ళు చిన్నదైన రమ్యను పెళ్లి చేసుకున్నాడు. రమ్య రఘుపతి.. ఆంధప్రదేశ్ మాజీ ఏఐసీసీ ప్రెసిడెంట్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు కుమార్తె రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నాడు. నరేష్ ను పెళ్లి చేసుకునే సమయంలో రమ్య వయసు.. 30ఏళ్ల లోపే.. ఈ దంపతులు అనంతరపురం లోని హిందూపురంలో కూడా ఉన్నారు. వీరికి కూడా ఓ కొడుకు ఉన్నాడు. రెండుళ్లు కలిసి కాపురం చేసిన ఈ జంట గత ఎనిమిదేళ్లుగా రమ్య, నరేష్ లు దూరంగా ఉన్నారు.

అయితే ఇప్పుడు నరేష్ నాలుగోసారి క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్ర లోకేష్ ను మహాబలిపురం లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో రమ్య రంగంలోకి దిగి.. తన భర్తకు తనకు విడాకులు ఇవ్వలేదని.. ఇప్పుడు ఎలా పవిత్రను పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తుంది. అంతేకాదు.. తాను తన భర్తకు ఎట్టిపరిస్థితుల్లోనూ విడాకులు ఇవ్వనని తేల్చి చెప్పేసింది.

నరేష్ తో కలిసి ఉంటున్న పవిత్ర లోకేష్ కి కూడా ఇది మూడో పెళ్లి కావడం విశేషం.. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. ప్రస్తుతం రెండో భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాత్‌తో విడాకులు కోర్టు గుమ్మంలో ఉన్నాయి. దీంతో నరేష్ .. రమ్యకు, పవిత్ర సుచేంద్రకు విడాకులు ఇచ్చిన అనంతరం ఈ జంట పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu