Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganguly and Nagma Love: అప్పట్లో అసాధారణ రిలేషన్… సౌరవ్ గంగూలీ, నగ్మాలు ఎందుకు విడిపోయారంటే..

మనం వేరొకరి జీవితాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నామని మనకు అనిపిస్తే.. ఆ రిలేషన్ కు గుడ్ బై చెప్పేసి.. జీవితంలో ముందుకు సాగడం ఉత్తమం అని నగ్మా చెప్పింది.

Ganguly and Nagma Love: అప్పట్లో అసాధారణ రిలేషన్... సౌరవ్ గంగూలీ, నగ్మాలు ఎందుకు విడిపోయారంటే..
Saurav Ganguly And Nagma Re
Follow us
Surya Kala

|

Updated on: Jul 08, 2022 | 1:32 PM

Saurav Ganguly and Nagma Love: సినిమా తారలు,  క్రీడాకారులు..  ముఖ్యంగా క్రికెటర్స్ మధ్య ప్రేమ సహజీవనం, పెళ్లి వంటి వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి.  భిన్న ధృవాలు.. ఈ రెండు ప్రపంచాలకు చెందిన వ్యక్తులు .. అయిన నటీనటులు, క్రికెటర్స్ ల మధ్య స్నేహ సంబంధాలు, ప్రేమ  సందర్భాల్లో బయటపడుతూ ఉంటాయి. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన నటీనటుల మధ్య ఎక్కువగా ప్రేమ కథలు వినిపిస్తూనే ఉంటాయి. వాటిల్లో చాలా వరకూ పెళ్లి పీటలు ఎక్కకుండా ప్రేమతోనే అసంపూర్ణంగా మిగిలిపోయాయి.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జూన్ 8న తన 49వ పుట్టినరోజును జరుపుకున్నారు. అభిమానులు, అనుచరులు, భారత జట్టు సభ్యులు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో కొందరు నటి నగ్మాతో విడిపోయిన కథను కూడా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం గంగూలీ, నగ్మాల లవ్ స్టోరీ వైరల్ అయ్యింది. వీరిద్దరి మధ్య విషాద ప్రేమ కథ గురించి తెలుసుకోండి.

నటి నగ్మా, భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మధ్య సంబంధం అప్పట్లో ఓ రేంజ్ లో చర్చనీయాంశమైంది. 2000ల ప్రారంభంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని చాలా పుకార్లు వినిపించాయి. అయితే అప్పటికే గంగూలీ ప్రముఖ డ్యాన్సర్ డోనా గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో గంగూలీ, నగ్మాల మధ్య ప్రేమ , సంబంధం అసాధారణమైనదిగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఒక ఇంటర్వ్యూలో.. నగ్మా ..తనకు గంగూలీల మధ్యగల సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడింది. తమ సంబంధంపై వచ్చిన ఆరోపణలను తాను ఎప్పుడూ ఖండించలేదని పేర్కొంది.”ఎవరు ఏమి మాట్లాడినా తాము ఖండించలేదు. ఒకరి జీవితంలో..  ఒకరి అస్తిత్వాన్ని మరొకరు తిరస్కరించుకోనంత వరకు.. ఎవరైనా తమకు కావలసినది ఇది అని చెప్పగలరు” అని నగ్మా తెలిపింది.

తాము విడిపోవడానికి గల కారణాల నగ్మా ప్రస్తావిస్తూ.. “గంగూలీలకు చెందిన ఇతర విషయాలతో పాటు కెరీర్ ప్రమాదంలో పడింది. కనుక తాము  విడిపోవాల్సి వచ్చింది. ఇద్దరం ఇగోలకు పోకుండా.. జీవితానికి సంబంధించిన విషయాలను బేరీజు వేసుకోవాల్సి వచ్చింది. మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు గంగూలీ తన ఆటలో ఫామ్ ని కోల్పోయాడు.. అప్పుడు గంగూలీ పేలవమైన ఆటతీరుతో ప్రజలు నన్ను  నిందించడం ప్రారంభించారని నగ్మా చెప్పారు. క్రికెట్ ఒక ఆట.. అయినప్పటికీ ప్రజలు దానిని గుర్తించకుండా.. వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ..  చెలరేగిపోతారని నగ్మా వెల్లడించింది. మనం వేరొకరి జీవితాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నామని మనకు అనిపిస్తే.. ఆ రిలేషన్ కు గుడ్ బై చెప్పేసి.. జీవితంలో ముందుకు సాగడం ఉత్తమం అని నగ్మా చెప్పింది.

బాలీవుడ్ లో హీరోయిన్ అడుగు పెట్టిన నగ్మా టాలీవుడ్ లో 2000లలో స్టార్ హీరోయిన్. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, భోజ్‌పురి, మరాఠీ సినిమాలలో నటించింది. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నగ్మా

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..