Hero Vishal: ‘అవును.. ఆ అమ్మాయితో లవ్‌లో ఉన్నాను’.. ప్రేమ, పెళ్లి గురించి విశాల్ కామెంట్స్
హీరో విశాల్ తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు వెల్లడించారు.
Kollywood: కోలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న విశాల్.. వివాదాల్లోనూ అంతే పేరు సంపాదించుకున్నాడు. ఇక పందెంకోడి(Pandem Kodi)సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన విశాల్.. తాజగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇటీవలే సామాన్యుడు సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన విశాల్.. ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. అయితే ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లిపై స్పందించాడు. త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు స్వయంగా విశాలే అనౌన్స్ చేశాడు. ప్రజెంట్ ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే ఆమె ఎవరనే విషయాన్ని చెబుతానని అన్నాడు. అయితే ఇప్పటికే విశాల్‌కు నటి అనీషా అల్లారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. కానీ కొద్ది రోజులకే పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్(varalaxmi sarathkumar)తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కానీ దీనిపై విశాల్ ఎప్పుడు స్పందించలేదు. కానీ తాజాగా ఓ యువతితో పీకల లోతు ప్రేమలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు విశాల్. త్వరలోనే అమ్మాయి ఎవరన్న విషయాన్ని చెబుతానని అన్నాడు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..