England – India Test: నాలుగో రోజు ముగిసిన ఆట.. టీమ్ ఇండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్ - ఇండియా ఐదో టెస్టు నాలుగో రోజు ముగిసింది. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆట ఆరంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఇక ఆ జట్టు...
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్ – ఇండియా ఐదో టెస్టు నాలుగో రోజు ముగిసింది. 378 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆట ఆరంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఇక ఆ జట్టు గెలవాలంటే కేవలం 119 పరుగులు మాత్రమే కావాలి. హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన జో రూట్(76), జానీ బెయిర్‌స్టో(72) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇక ఆట ఒక రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే. ఒకవేళ వర్షం కురిసి ఆట ఆగిపోతే మ్యాచ్ డ్రా గా ముగుస్తుంది. ఓవర్ నైట్ 125/3 తో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ఇండియా మరో 120 పరుగులు చేసి 245 పరుగులకు ఆల్ అవుట్ అయింది. పంత్(57) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా.. ఇప్పటికే 2-1 తో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్‌లో విజయమైనా సాధించాలి లేదా డ్రా అయినా చేసుకోవాలి. ఒక వేళ ఇంగ్లాండ్ గెలిస్తే మాత్రం 2-2తో సిరీస్ సమానం అవుతుంది.
మరోవైపు.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతోన్న ఐదో టెస్ట్‌లో రిషబ్ పంత్ సత్తా చాటుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత అర్ధ సెంచరీని సాధించాడు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని ఓ రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే, విదేశీ గడ్డపై సెంచరీ తర్వాత హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ధోనీ నుంచి ఫరూఖ్ ఇంజనీర్ వరకు ఎవరూ ఈ ఘనత సాధించలేకపోవడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి