India – England: మూడో రోజు ముగిసిన ఆట.. మరోసారి నిరాశపరిచిన కోహ్లీ.. టీమిండియా స్కోరెంతంటే..
బర్మింగ్ హామ్ వేదికంగా ఇంగ్లాండ్ - ఇండియా ఐదో టెస్టు మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. తద్వారా భారత్ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో పుజారా, పంత్....
బర్మింగ్ హామ్ వేదికంగా ఇంగ్లాండ్ – ఇండియా ఐదో టెస్టు మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. తద్వారా భారత్ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో పుజారా, పంత్ ఉన్నారు. కోహ్లీ(20), శుభ్‌మన్ గిల్(4), హనుమ విహారి(11) వద్ద ఔట్ అయ్యారు. కాగా అంతకు ముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. బెన్‌స్టోక్స్ వేసిన 29.5 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా అది చేజారింది. అయితే, పక్కనే ఉన్న జోరూట్ ఆ బంతిని అందుకోవడంతో కోహ్లి పెవిలీయన్ బాటపట్టాడు. ప్రస్తుతం 45 ఓవర్లకు 125/3 గా ఉంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్.. నాలుగు పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయింది. 43 పరుగుల వద్ద విహారి(11) ఔటయ్యాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడినప్పటికీ 75 పరుగుల వద్ద కోహ్లీ(20) స్టోక్స్ బౌలింగ్‌లో పట్టుబడ్డాడు. ఈ క్రమంలో పుజారా అర్ధశతకం నమోదు చేయడం విశేషం.
మూడో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 45.3 ఓవర్ల తర్వాత వర్షం కురవడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో 106 పరుగులు మరో సారి సెంచరీ సాధించడం గమనార్హం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి