AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: కెప్టెన్సీ వివాదంపై తొలిసారి మౌనం వీడిన జడేజా.. ఏమన్నాడంటే?

ఐపీఎల్‌లో కెప్టెన్సీ వివాదంపై తాజాగా జడేజా కీలక విషయం చెప్పుకొచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన అనంతరం జడేజా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

IND vs ENG: కెప్టెన్సీ వివాదంపై తొలిసారి మౌనం వీడిన జడేజా.. ఏమన్నాడంటే?
India Vs England Ravindra Jadeja
Venkata Chari
|

Updated on: Jul 03, 2022 | 3:25 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ టీమ్ ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చాలా నిరాశను కలిగించింది. IPL 2022 ప్రారంభానికి ముందు, ధోని కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించింది. కానీ, జడేజా కెప్టెన్సీలో అద్భుతాలు చూపించలేకపోయాడు. దాంతో ఎంఎస్ ధోని మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. తర్వాత జడేజా గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్సీ వివాదంపై తాజాగా జడేజా కీలక విషయం చెప్పుకొచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన అనంతరం జడేజా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆ ఘటన నుంచి తాను పూర్తిగా బయటకు వచ్చేవాను. అదే సమయంలో దృష్టి మొత్తం భారత్ తరపున ఆడటం, మంచి ప్రదర్శన చేయడంపైనే ఉంచానని చెప్పుకొచ్చాడు.

రవీంద్ర జడేజా మాట్లాడుతూ, ‘ఏం జరగాలో అదే జరిగింది. ఐపీఎల్‌ గురించి నా మనసులో పెద్దగా ఆశలు లేవు. భారత్‌ తరపున ఎప్పుడు ఆడినా, దృష్టి అంతా జట్టుపైనే ఉంటుంది. నాకు అదే అనిపించేది. భారతదేశానికి మంచి చేయడం కంటే గొప్ప సంతృప్తి లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌లో సెంచరీ సాధించడం చాలా పెద్ద విషయం: జడేజా

జడేజా మాట్లాడుతూ, ‘భారత్ వెలుపల, ముఖ్యంగా ఇంగ్లండ్‌లో బాగా రాణించడం నిజంగా సంతోషంగా ఉంది. ఆటగాడిగా 100 పరుగులు చేయడం పెద్ద విషయం. ముఖ్యంగా ఇంగ్లిష్ పరిస్థితుల్లో 100 పరుగులు చేసిన తర్వాత ఆటగాడిగా నాపై నేను కొంత విశ్వాసాన్ని పొందగలను. నేను చాలా బాగున్నాను’ అంటూ పేర్నొన్నాడు.

‘9, 10, 11వ ఆర్డర్‌ల ఆటగాళ్లు బ్యాటింగ్‌లో చాలా ప్రాక్టీస్ చేస్తారు. మా టీమ్ మేనేజ్‌మెంట్ వారు ప్రాక్టీస్ సెషన్‌లలో తమ బ్యాటింగ్‌పై పని చేసేలా చూసుకుంటారు. 9, 10, 11వ ఆర్డర్‌ బ్యాటర్లు పరుగులు సాధించినప్పుడు అది జట్టుకు బోనస్‌. బుమ్రా నెట్స్‌లో బ్యాటింగ్ చేసినప్పుడల్లా దాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. ఇతర బ్యాటర్లతో కలిసి అతను చేసిన చివరి 40-50 పరుగులు టీంకు చాలా గొప్ప బోనస్’ అని తెలిపాడు.