Rishabh Pant vs MS Dhoni: గురువును మించిన శిష్యుడు.. రన్స్ నుంచి స్ట్రైక్ రేట్ వరకు.. పూర్తి జాబితా ఇదిగో..

IND vs ENG: ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడగా, రిషబ్ పంత్ ఇప్పటివరకు 31 టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. పంత్ తన టెస్ట్ కెరీర్‌లో ఎన్నో భారీ విజయాలు సాధించడంతో నెటిజన్లు ధోనీతో పోల్చుతున్నారు.

Rishabh Pant vs MS Dhoni: గురువును మించిన శిష్యుడు.. రన్స్ నుంచి స్ట్రైక్ రేట్ వరకు.. పూర్తి జాబితా ఇదిగో..
Dhoni Vs Pant
Follow us
Venkata Chari

|

Updated on: Jul 02, 2022 | 5:07 PM

Rishabh Pant vs MS Dhoni: ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టులు ఆడగా, రిషబ్ పంత్ ఇప్పటివరకు 31 టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. పంత్ తన చిన్న టెస్ట్ కెరీర్‌లో ఎన్నో భారీ విజయాలు సాధించాడు. రిషబ్ పంత్ ఇప్పటివరకు 31 టెస్టులు మాత్రమే ఆడినా.. బలమైన ఆటగాడిగా తనదైన ముద్ర వేశాడు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాట్‌తో అద్భుత ప్రదర్శనతో అతడ్ని భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎంఎస్ ధోనీతో పోలుస్తున్నారు. ఈ పోలిక కూడా నిజమే. ఎందుకంటే రిషబ్ తన టెస్టు కెరీర్‌లో ధోని సాధించిన ఎన్నో విజయాలను సరిపోల్చుకుంటూ ముందుకుసాగుతున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో గురు, శిష్యుల గణాంకాలను ఒకసారి చూద్దాం..

మొత్తం సెంచరీలు: ధోని తన కెరీర్‌లో మొత్తం 90 టెస్టులు ఆడాడు. ఇందులో అతను కేవలం 6 సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు. కాగా, రిషబ్ పంత్ ఇప్పటి వరకు 31 టెస్టుల్లో 5 సెంచరీలు సాధించాడు.

ఆసియా వెలుపల సెంచరీలు: ధోని తన టెస్ట్ కెరీర్‌లో ఆసియా వెలుపల 39 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ, అతను ఎప్పుడూ సెంచరీ చేయలేకపోయాడు. ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే.. ఆసియా వెలుపల 23 టెస్టుల్లో 4 సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్‌లో రెండు సెంచరీలు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో ఒక్కో సెంచరీ సాధించాడు.

ఇవి కూడా చదవండి

వేగవంతమైన సెంచరీ: 2005లో పాకిస్థాన్‌పై ధోని 93 బంతుల్లో టెస్టు సెంచరీ సాధించాడు. ఇది భారత వికెట్ కీపర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా మారింది. అయితే తాజాగా రిషబ్ పంత్ కూడా ఇంగ్లండ్‌పై ఎడ్జ్‌బాస్టన్‌లో 89 బంతుల్లో సెంచరీ సాధించి ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

టెస్టు క్రికెట్‌లో పరుగులు: ధోని టెస్టు క్రికెట్‌లో 144 ఇన్నింగ్స్‌ల్లో 4876 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 52 ఇన్నింగ్స్‌ల్లో 2066 పరుగులు చేశాడు.

బ్యాటింగ్ సగటు: ధోని తన కెరీర్‌లో 38.09 బ్యాటింగ్ సగటుతో పరుగులు చేశాడు. ఈ విషయంలో రిషబ్ చాలా ముందున్నాడు. అతని బ్యాటింగ్ సగటు 43.04గా నిలిచింది.

స్ట్రైక్ రేట్: టెస్టు క్రికెట్‌లో ధోని స్ట్రైక్ రేట్ 59.11 కాగా, రిషబ్ పంత్ ఇప్పటివరకు 72.84 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు.

వికెట్ కీపింగ్: ధోని టెస్ట్ క్రికెట్‌లో వికెట్ల వెనుక మొత్తం 294 మందిని పెవిలియన్ చేర్చాడు. అంటే ఒక్కో మ్యాచ్‌కు 3.26 చొప్పున వికెట్లు పడగొట్టాడు. రిషబ్ పంత్ ఇప్పటివరకు 118 మంది బ్యాట్స్‌మెన్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే ఈ సందర్భంలో అతని సగటు 3.80గా నిలిచింది. ఈ విషయంలోనూ పంత్ తన గురువు ధోనీ కంటే కొంచెం ముందున్నాడు.