Viral: భుజంపై బ్యాగుతో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న వ్యక్తి.. అనుమానంతో పోలీసులు ఆపి చెక్ చేయగా షాక్

రోజుకో కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు స్మగ్లర్స్. ఈ గబ్బు పని కోసం అనువైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. పోలీసుల వేట అధికంగా ఉండటంతో స్మగ్లర్స్ మత్తును రవాణా చేసేందుకు కొత్త.. కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు.

Viral: భుజంపై బ్యాగుతో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న వ్యక్తి.. అనుమానంతో పోలీసులు ఆపి చెక్ చేయగా షాక్
representative image
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 03, 2022 | 8:58 PM

Crime News: పోలీసులు ఎంత అలెర్ట్‌గా ఉంటున్నా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. డ్రగ్స్, గంజాయి రవాణాకు చెక్ పెట్టడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. రోజుకో కొత్త మార్గంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు స్మగ్లర్స్. ఈ గబ్బు పని కోసం అనువైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. పోలీసుల వేట అధికంగా ఉండటంతో స్మగ్లర్స్ మత్తును రవాణా చేసేందుకు కొత్త.. కొత్త మార్గాలను అన్వేశిస్తున్నారు.  పోలీసులే విస్తుపోయేలా క్రియేటివిటీ చూపిస్తున్నారు కేటుగాళ్లు. పుష్ప(Pushpa) సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) కంటే ఎక్కువ తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. జైల్లో పెట్టినా బయటకి వచ్చాక ‘తగ్గేదే లే’ అంటూ అదే దందా కొనసాగిస్తున్నారు. ఇందు గలదు.. అందు లేదు అని సందేహం వలదు. ఇప్పుడు పోలీసులు ఎందెందు వెతికినా గంజాయే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా నిత్యం డ్రగ్స్, గంజాయి పట్టుబడుతున్న కేసులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే.. గంజాయి వ్యాపారం చేసే అసలు స్మగ్లర్స్ చిక్కడం లేదు. అర కొర డబ్బు కోసం ఈ పని చేస్తూ… మధ్యలో పేద, మధ్య తరగతి వర్గాల వారే బుక్ అవుతున్నారు. తాజాగా పంజాబ్ రాష్రంలోని లథియానా జిల్లా ఖన్నా నగరంలో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి.. NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. గోబీద్‌గఢ్ నుంచి ఓ వ్యక్తి కాలినడకన వెళ్తూ అటుగా వెళ్తున్న పోలీసులకు కనిపించాడు. అయితే అతని భుజంపై ఓ సంచి ఉంది. అనుమానం వచ్చి ఆరా తీయగా అతనిది బీహార్‌లోని హార్లాకి జిల్లా మధువానిగా గ్రామంగా తెలిసింది. బ్యాగులో చెక్ చేయగా నాలుగున్నర కిలోల గంజాయి కనిపించింది. ప్రస్తుతం అతను లథియానాలోని జలంధర్ బైపాస్ వద్ద గల ఓ అద్దె ఇంట్లో ఉంటూ గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు తేలింది.

Ganja

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి