Viral Video: ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును అతడు తెలివిగా రక్షించాడు..

మానవత్వానికి ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతన్న వీడియోలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలిచి ఉంది.. రోడ్డు మొత్తం నీటమునిగిన ఉండగా, ఓ ఆవు ఆటుగా నడుస్తూ కనిపించింది.

Viral Video: ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును అతడు తెలివిగా రక్షించాడు..
Cow Got Electric Shock
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2022 | 9:26 PM

మానవత్వానికి ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రానికి చెందినదిగా తెలిసింది. మాన్సా జిల్లాలో ఒక ఆవు నీటిలో విద్యుదాఘాతానికి గురై బాధపడుతుండగా, ఓ దుకాణదారుడు తెలివిగా ఆవు ప్రాణాలను కాపాడాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటి?

వైరల్‌ అవుతన్న వీడియోలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలిచి ఉంది.. రోడ్డు మొత్తం నీటమునిగిన ఉండగా, ఓ ఆవు ఆటుగా నడుస్తూ కనిపించింది. నీటిలో నడుస్తున్న ఆవు అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురైంది. ఆవు గట్టి గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆవు అరుపులకు చుట్టుపక్కల జనాలు బయటకు వచ్చారు. అలా చూస్తుండగానే ఆ ఆవు అరుస్తూ కిందపడిపోయింది. అంతలోనే ఒక దుకాణదారుడు మానవత్వానికి ఉదాహరణగా నిలిచాడు. దుకాణదారుడు తన తెలివితో ఆవును కాపాడుతాడు. అయితే, ఇక్కడ అసలు ఏం జరిగిందంటే.. ఆవు నిలబడిన ప్రదేశంలో విద్యుత్ స్తంభం ఉండటం గమనించిన ఆ వ్యక్తి.. ఆ స్తంభానికి అనుసంధానించబడిన విద్యుత్ తీగ నీటిలో పడిపోయిందని చెబుతున్నారు. దీంతో నీటిలో కరెంట్‌ పాస్‌ అవుతోంది. దాంతో ఆవు కరెంట్‌తో కిందపడి గిలగిలా కొట్టుకుంటోంది. దుకాణదారుడు వెంటనే గుడ్డ సహాయంతో ఆవును రక్షించాడు. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయింది. ఇది మొదటి సారి కాదు, గతంలో చాలా సార్లు ప్రజల ధైర్యసాహసాలు నోరులేని మూగజీవాలను కాపాడినప్పుడు ఇలాంటి వీడియోలు తెరపైకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోను అనామిక జైన్ అంబర్ తన ఐడీతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.. కేవలం 19 గంటల క్రితం అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియోను ఈ వార్త వ్రాసే సమయానికి 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై ట్విట్టర్ యూజర్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి