Marriage Food: వాటే ఐడియా సర్ జీ.. జోరు వానొచ్చిన తినడంలో తగ్గేదే లే.. వీళ్లు చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..

అటువంటి ఫన్నీ వీడియో మరోకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో తిండిపై జనాల క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. వీడియో చూసి మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు.

Marriage Food: వాటే ఐడియా సర్ జీ.. జోరు వానొచ్చిన తినడంలో తగ్గేదే లే.. వీళ్లు చేసిన పని చూస్తే నోరెళ్లబెడతారు..
Marriage Food
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2022 | 9:06 PM

Marriage Food:  ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒక్కోసారి ఆ వీడియోలు నమ్మలేని విధంగా షాకింగ్‌గా ఉంటాయి. అదే సమయంలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంటర్నెట్‌లోని పలు రకాల ఆహారాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతుంటాయి. అటువంటి ఫన్నీ వీడియో మరోకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో తిండిపై జనాల క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. వీడియో చూసి మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఆహారం పట్ల పిచ్చి అంటే అలాంటిది అని చెబుతారు. వైరల్ వీడియోలో మీరు చూసే వ్యక్తులకు ఆహారం అంటే ఇష్టమని కూడా చెప్పవచ్చు. వారి ఆకలి కంటే పెద్దది మరెదీ లేదని కూడా చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పెళ్లి వేడుకకు సంబంధించినది. వివాహ వేడుకలో భారీ వర్షం కురుస్తుంది. కానీ కుండపోత వర్షాన్ని కూడా లెక్కచేయకుండా కొందరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు. భారీ వర్షంతో డైనింగ్‌ ఏరియా మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ భోజనం చేస్తున్నవారంతా..వర్షం పడకుండా ఖాళీ కూర్చీలను ఒంటి చేత్తో పట్టుకుని తలపై బోర్లాగా పెట్టుకున్నారు. మరో చేత్తో హాయిగా భోజనం చేస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో mr_90s_kidd_ అనే ఖాతాతో పోస్ట్ చేయబడింది. జూన్ 20న పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు, ‘ ఆహారం పట్ల మక్కువ ఉంటే ఇలాగే ఉంటుంది మరీ అంటున్నారు. ఆకలి ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి