రండి.. రారండి.. మాంసం ప్రియులకు స్పెషల్ ఆహ్వానం.. షాపు ముందు క్యూ కట్టిన జనం.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఇప్పటికే చికెన్ రేటు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఇంకా కోడి గుడ్డు రేటు కూడా కొండెక్కుతోంది. ఇప్పుడు కోడి గుడ్డు ధర రూ. 7కు చేరింది. కానీ, అక్కడ మాత్రం

రండి.. రారండి.. మాంసం ప్రియులకు స్పెషల్ ఆహ్వానం.. షాపు ముందు క్యూ కట్టిన జనం.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే..
Chicken Curry Recipe In Tel
Follow us

|

Updated on: Jul 03, 2022 | 6:27 PM

దేశప్రజలందరూ ధరాఘాతంతో అల్లాడిపోతున్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ నుంచి గ్యాస్ వరకు చాలా వాటి ధరలు పైకి చేరాయి. బియ్యం ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు చికెన్ ధరలు మరోసారి పైకి చేరుతున్నాయి. ఇప్పటికే చికెన్ రేటు ఎక్కువగా ఉంది. ఇప్పుడు మరింత పెరుగుతోంది. ఇంకా కోడి గుడ్డు రేటు కూడా కొండెక్కుతోంది. ఇప్పుడు కోడి గుడ్డు ధర రూ. 7కు చేరింది. కానీ, అక్కడ మాత్రం రూ. 155 రూపాయలకే కిలో చికెన్ అంటున్నారు వ్యాపారులు. దాంతో చికెన్‌ ప్రియులు బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూకట్టి చికెన్‌ కొనుగోలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చికెన్‌ కోసం మాంసం ప్రియులు ఎగబడ్డారు. ఆ చికెన్‌ దుకాణం ముందు ఏర్పాటు చేసిన విచిత్ర బోర్డు సైతం మాంసం ప్రియులను ఆకట్టుకుంటోంది. ఆ బోర్డుపై 155 రూపాయలకే కిలో చికెన్ అని రాసి ఉంది. అంతేకాకుండా మాంసం ప్రియులను ఆకట్టుకునేందుకు రారమ్మని పిలుస్తూ మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. అసలే ఆదివారం ఆపై భారీ ఆఫర్ ఇంకేముంది..మాంసం ప్రియులు ఎగబడ్డారు. చికెన్ కొనుగోలు చేసేందుకు క్యూ లైన్ లో నిలబడి కొనుగోలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, రాష్ట్రవ్యాప్తంగా చికెన్ రేట్ రూ.280 నుండి రూ.300 మార్కెట్లలో విక్రయిస్తుంటే ఇతను మాత్రం డిఫరెంట్ గా తక్కువ చేసి ఎందుకు అమ్ముతున్నాడు అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. కానీ, కొందరు చెప్పుకుంటున్నది ఏంటంటే ప్రపంచంలో ఏ వ్యాపారం చూసినా కాంపిటీషన్ కావడంతో ఎలానైనా బిజినెస్ పెంచుకోవడం కోసం బిజినెస్ లాస్‌ అయినప్పటికీ ఇతను మాత్రం చికెన్ నూట యాభై రూపాయలకే చికెన్ విక్రయిస్తుంటే మాంసప్రియలు మాత్రం ఎగబడి చికెన్ కొనుగోలు చేస్తున్నారు. మరీ చికెన్ సెంటర్ యజమాని ఎలా గిట్టుబాటు అవుతుందో తెలియదు కానీ ఇది విశేషంగానే కొందరు చెప్పుకుంటున్నారు