AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peacock Video: మీరెన్నాడూ చూడని అద్భుత దృశ్యం.. నెమళ్లకు ఎగిరేపోటీలు.. వీడియో చూస్తే ఫ్లాట్‌ అవటం ఖాయం!

ఇటీవల నెమలి ఎగురుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అలాంటిదే ఇప్పుడు మరో వీడియో నెట్టింట మళ్లీ వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక్క నెమలి కాదు నెమళ్ల గుంపు గాల్లో ఎగురుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి.

Peacock Video: మీరెన్నాడూ చూడని అద్భుత దృశ్యం.. నెమళ్లకు ఎగిరేపోటీలు.. వీడియో చూస్తే ఫ్లాట్‌ అవటం ఖాయం!
Peacock Flying
Jyothi Gadda
|

Updated on: Jul 03, 2022 | 3:33 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చాలానే చూస్తుంటాం. ఉల్లాసకరమైన వీడియోలు ఇంటర్నెట్‌లో త్వరగా వైరల్ అవుతాయి. నెమళ్లు డ్యాన్స్ చేసే వీడియోలను చూడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నెమళ్లు చాలా అరుదుగా నృత్యం చేస్తూ కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోలు చాలా అందంగా ఉంటాయి. ఇటీవల నెమలి ఎగురుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. నెమళ్లు నడవడం, కూర్చోవడం, డ్యాన్స్ చేయడం చాలా అరుదుగా చూస్తుంటాం. నెమళ్లకు ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. బహుశా వాటి శరీరాలు ఇతర పక్షుల కంటే బరువుగా ఉంటాయి. అందుకే నెమలి కొద్దిదూరం ఎగురుతున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అలాంటిదే ఇప్పుడు మరో వీడియో నెట్టింట మళ్లీ వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక్క నెమలి కాదు నెమళ్ల గుంపు గాల్లో ఎగురుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి.

ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఒక సరస్సు మీదుగా నెమళ్లు ఎగురుతున్నాయి. ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు ఎగురుతున్న ఈ వీడియో ఇంటర్‌నెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఎక్కడో పార్క్ లాంటి ప్రదేశమని వీడియో చూస్తే అర్థమవుతోంది. అక్కడ నెమళ్లు ఎగరడం చూస్తుంటే వాటన్నింటికీ ఎగిరే పోటీని ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. దీనిని నెమళ్ల విమానమని పిలవాలి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను యోగా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్నలు ఈ వీడియోని వీక్షించారు. 20 సెకన్ల వీడియోని చాలా మంది లైక్ చేశారు. కామెంట్లు కుమ్మరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి