KTR help: ఆ బాలిక వివరాలు చెప్పండి.. నేను సాయం చేస్తాను..! మరోసారి కేటీఆర్ గొప్పతనం..

KTR help: ఆ బాలిక వివరాలు చెప్పండి.. నేను సాయం చేస్తాను..! మరోసారి కేటీఆర్ గొప్పతనం..

Anil kumar poka

|

Updated on: Jul 03, 2022 | 3:13 PM

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ఒకే కాలుతో రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న పాఠశాలకు..


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి సోషల్‌ మీడియాలో ఒకే కాలుతో రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న పాఠశాలకు ఓ బాలిక వీడియో తెగ వైరల్‌ అవుతుంది. అయితే తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్‌.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు. బీహార్‌లోని సివాన్‌ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకుటోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది. తనకు డాక్టర్‌ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 03, 2022 03:13 PM