Customer care: 3 గంటలు హోల్డ్‌లో ఉంచిన కస్టమర్ కేర్.. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి టిక్కెట్ రీబుక్ చేసుకున్న వ్యక్తి ..
అమెరికాలో ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్ ఒక కస్టమర్‌ను నాలుగు గంటలపాటు హోల్డ్‌లో ఉంచారు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం టిక్కెట్‌ను రీబుక్ చేసుకున్నాడు.
అమెరికాలో ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్ ఒక కస్టమర్‌ను నాలుగు గంటలపాటు హోల్డ్‌లో ఉంచారు. దీంతో విసుగు చెందిన ఆ వ్యక్తి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి విమానం టిక్కెట్‌ను రీబుక్ చేసుకున్నాడు. రేడియో స్టేషన్ మేనేజర్ బ్రెయిన్ డ్రైవర్ తన వ్యాపార పర్యటన నిమిత్తం డెన్వర్‌కి టిక్కెట్‌ను రీబుక్ చేయాలనుకున్నాడు. జూన్ 16న ఒక వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్ రీబుకింగ్‌కు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో ఆ సంస్థ చాట్ ఫ్లాట్‌ఫాం ద్వారా ఒక ఏజెంట్‌ను సంప్రదించి టిక్కెట్ రీబుక్ చేసుకున్నాడు. అయితే తనకు అనుకూలమైన సీటును మార్చుకోలేకపోయాడు. బ్రెయిన్ ఆ మరునాడు ఆ ఎయిర్‌లైన్స్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా బిజీ అని వచ్చింది. ఆ తర్వాత రోజున మళ్లీ ప్రయత్నించగా కస్టమర్ కేర్ సిబ్బంది ఆయనను మూడు గంటల 45 నిమిషాలపాటు హోల్డ్‌లో ఉంచారు. దీంతో ఎయిర్‌లైన్స్ తీరుపై బ్రెయిన్ డ్రైవర్ విసిగిపోయాడు. చేసేదేమీ లేక 45 నిమిషాలు డ్రైవ్ చేసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. టిక్కెట్ రీబుకింగ్‌కు సంబంధించిన సీటును మార్చుకున్నాడు. అయితే ‘ఎయిర్‌లైన్ కాల్ సెంటర్ ద్వారా ఎదుర్కొన్న అత్యంత చెత్త అనుభవం ఇది’ అని విమర్శించాడు.మరోవైపు కస్టమర్‌కు కలిగిన అసౌకర్యంపై ఆ అమెరికా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రతినిధి స్పందించారు. జూన్ మధ్యలో వాతావరణం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమస్యల వల్ల కాల్ సెంటర్ కాల్స్‌ను కొన్ని గంటలు హోల్డ్‌లో ఉంచడం సాధారణ విషయమని తెలిపారు. కాగా, జూన్ 16, 19న అమెరికాలోని ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు కారణాలతో సుమారు 35,000 విమానాలను రద్దు చేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?