Guntur: వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్కపిల్ల మృతి.. యజమాని, బంధువుల ఆందోళన

రాత్రి ఆరున్నర ఏడుగంటల సమయంలో గుంటూరు ఏటి అగ్రహారం పదకొండో లైన్‌లో శివారెడ్డి ఇంట్లోకి వీధి కుక్కలు చొరబడ్డాయి. దాదాపు పది - పదిహేను వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. అయితే.. దాడి చేసింది శివారెడ్డి ఇంటిలోని

Guntur: వీధి కుక్కల దాడిలో పెంపుడు కుక్కపిల్ల మృతి.. యజమాని, బంధువుల ఆందోళన
Pet Puppy
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2022 | 2:29 PM

రాత్రి ఆరున్నర ఏడుగంటల సమయంలో గుంటూరు ఏటి అగ్రహారం పదకొండో లైన్‌లో శివారెడ్డి ఇంట్లోకి వీధి కుక్కలు చొరబడ్డాయి. దాదాపు పది – పదిహేను వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. అయితే.. దాడి చేసింది శివారెడ్డి ఇంటిలోని మనుషులపై కాదు..‌ శివారెడ్డి పెంచుకుంటున్న కుక్క పిల్ల కూపిపై.. దీంతో చనిపోయిన పెంపుడు కుక్క పిల్లతో శివారెడ్డి, ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. ఏటి అగ్రహారం పదకొండో లైన్లో నివసించే శివారెడ్డి నెల రోజుల వయస్సున్న కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. దానికి కూపి అని పేరు పెట్టారు. వాళ్ళ మామ గారి ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న కుక్క పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శివారెడ్డి ఐదేళ్ళ కుమార్తె కూపితో ఎక్కువుగా ఆడుకునేది. అయితే నిన్న రాత్రి వీధి కుక్కలు ఒక్కసారిగా కూపిపై దాడి చేశాయి. తెల్లవారిన తర్వాత వైద్యుడు వద్దకు తీసుకెళ్థామని ఆకుటుంబ సభ్యులు అనుకున్నారు.

ఈ రోజు తెల్లవారు జామున శివారెడ్డి కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి కూపి చనిపోయింది. దీంతో శివారెడ్డి కుటుంబం ఆందోళనకు దిగింది. వీధి కుక్కల విషయంలో కార్పోరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని శివారెడ్డి ఆరోపించారు. కుక్కలను ఇతర ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ కూపి మృతదేహంతో నిరసనకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేసిన తర్వాత ఐదు వీధి కుక్కలను కార్పోరేషన్ సిబ్బంది ఇతర ప్రాంతానికి తరలించారు. మరో ఆరు ఏడు కుక్కలు ఇంకా తమ వీధిలోనే ఉన్నాయన్నారు. స్థానికులు పై కూడా దాడి చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు…. కూపి మరణంతో మొత్తానికి వీధి కుక్కల బెడద కొంత వరకూ తప్పిందని స్థానికులు అంటున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.