Tribals festival: పొలంలో మైసమ్మకు పందిబలి ఆచారం.. ఇప్ప పువ్వు సారాతో నైవేద్యం.. ఎక్కడంటే..

సాధారణంగా కొందరు అమ్మవార్లకు జంతుబలి ఇస్తుంటారు. కొందరు కోళ్లు, మేకలు, పొట్టేలు, దున్నలను బలి ఇస్తుంటారు కానీ, ఓ చోట అమ్మవారికి పందిని బలిస్తారట. వినడానికి వింతగా అనిపించినా..

Tribals festival:  పొలంలో మైసమ్మకు పందిబలి ఆచారం.. ఇప్ప పువ్వు సారాతో నైవేద్యం.. ఎక్కడంటే..
Mulugu,tribals
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2022 | 9:12 PM

సాధారణంగా కొందరు అమ్మవార్లకు జంతుబలి ఇస్తుంటారు. కొందరు కోళ్లు, మేకలు, పొట్టేలు, దున్నలను బలి ఇస్తుంటారు కానీ, ఓ చోట అమ్మవారికి పందిని బలిస్తారట. వినడానికి వింతగా అనిపించినా, దాని వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు అక్కడి భక్తులు. ఇంతకీ ఆ అమ్మవారు ఎవరూ..ఎక్కడ ఇలాంటి వింత ఆచారం కొనసాగుతుంది.. ఎందుకు పందిని బలి ఇస్తారనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ములుగు జిల్లా ఏటూరునాగారం పరిధిలో ఈ వింత ఆచారం కొనసాగిస్తున్నారు కొందరు గిరిజనులు. ఏటూరునాగారం పరిధిలోని ఇప్పలగడ్డ తండాలోని గిరిజనులు ఆనాదిగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి గిరిజనులు ఏటా మొదటగా భూమాతకు పూజ చేసిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు. దీనినే విత్తనం పండుగ అని పిలుస్తుంటారు. ఈ పండగ కోసం గిరిజన పెద్దలంతా కలిసి ప్రతి కుటుంబం నుంచి కొంత మొత్తంలో డబ్బులు పోగు చేసుకుంటారు. పోగుచేసిన డబ్బులతోనే విత్తనం పండుగను నిర్వహిస్తుంటారు. ప్రతి కుటుంబం నుంచి తెచ్చిన ధాన్యాలను కొన్ని భూదేవి వద్ద నాటుతారు. అనంతరం పొలం వద్దకు వెళ్లి మైసమ్మకు జంతు బలి సమర్పిస్తారు. పొలాల మధ్యలో ఉండే మైసమ్మ తల్లికి పందిని బలి ఇవ్వడం వల్ల పైరుకు మంచిదని, పంటను నాశనం చేసే పందులు మేలు చేస్తాయని వారి నమ్మకం..భూదేవికి పూజ, మైసమ్మకు జంతు బలి తర్వాత ఈ పండుగలో గ్రామ దేవతలకు ఇప్ప పువ్వులతో చేసిన సారాయిని నైవేద్యంగా ఆరబోస్తారు గిరిజనులు.

ఈ పండుగను జరుపుకోవడం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండుతాయని వీరి నమ్మకం. ఈ సంప్రదాయం పూర్వీకుల నుంచి కొనసాగుతుంది..అయితే, గ్రామంలో అందరు సమానమే అన్న భావన వచ్చేలా బలి ఇచ్చిన పంది మాంసంతో ఊరు పెద్దలందరూ సామూహిక విందు భోజనాలు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ పనులు మొదలు పెడతారు..ఈ సాంప్రదాయం కేవలం గిరిజనులలో మాత్రమే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!