Strange Wedding: ఇదెక్కడి సాంప్రదాయంరా బాబు..! శుభమా అంటూ పెళ్లి జరిగితే… వధువును అత్తారింటికి అలా సాగనంపాలట..

జీవితంలో జరిగే ఏకైక, గొప్ప వేడుక వివాహం. అలాంటి శుభకార్యంలో వితంతువు వేషధారణలో వధువుకు వీడ్కోలు పలికే గ్రామం మన దేశంలో ఒకటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Strange Wedding: ఇదెక్కడి సాంప్రదాయంరా బాబు..! శుభమా అంటూ పెళ్లి జరిగితే... వధువును అత్తారింటికి అలా సాగనంపాలట..
Strange Wedding
Follow us

|

Updated on: Jul 02, 2022 | 8:48 PM

strange wedding ceremony: పెళ్లి అంటే చాలు బోలెడు సంప్రదాయాలు. ఇక మన దేశంలో అయితే, వివాహాలకు సంబంధించి అనేక చిత్ర విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి. మనకు తెలిసినవి ఓ పదో..పరకో ఉంటాయేమో కానీ, చాలా మందికి తెలియని కొన్ని వింత సంప్రదాయాలు కూడా ఉన్నాయి. జీవితంలో జరిగే ఏకైక, గొప్ప వేడుక వివాహం. అలాంటి శుభకార్యంలో వితంతువు వేషధారణలో వధువుకు వీడ్కోలు పలికే గ్రామం మన దేశంలో ఒకటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎరుపురంగు పెళ్లి దుస్తులకు బదులు తెల్లటి దుస్తులలో అత్తారింటికి సాగనంపుతారు. అదేంటి అశుభం అనుకోవద్దు..ఈ విచిత్రమైన సంప్రదాయం పాటించే గ్రామం మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వితంతువు వేషధారణలో వధువుకు వీడ్కోలు పలికే గ్రామం మన దేశంలో ఒకటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. తల్లిదండ్రులు తమ కుమార్తెను ఎరుపు, పసుపు రంగు పెళ్లి దుస్తులకు బదులు తెల్లటి దుస్తులలో అత్తారింటికి సాగనంపుతారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లా భామ్‌డోంగ్రి గ్రామంలో ఇలాంటి విచిత్ర సాంప్రదాయం కొనసాగిస్తున్నారు అక్కడి ప్రజలు. గ్రామంలో గిరిజన సమాజానికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ఇక్కడ కూతురి పెళ్లయ్యాక తల్లిదండ్రులు ఆమెకు వితంతువు దుస్తులు ధరింపజేసి అత్తారింటికి పంపిస్తారు. అంతేకాదు పెళ్లికి హాజరయ్యే వారంతా కూడా తెల్లని దుస్తుల్లోనే కనిపిస్తారు. ఇక్కడి ప్రజలు గోండి ఆచారాన్ని అనుసరిస్తారు. వారి నమ్మకం ప్రకారం తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. అందుకే వాళ్ళు ఈ రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తారు.

ఇక్కడి గిరిజనం ఇంకా అనేక వింత సాంప్రదాయాలను పాటిస్తున్నారు. పెళ్లి సమయంలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేయటంలో కూడా ఓ విచిత్రం ఉంటుంది. వీరి ఆచారంలో నాలుగు ప్రదక్షిణలు వధువు ఇంటి వద్ద, మిగిలిన మూడు ప్రదక్షిణలు వరుడి ఇంట్లో చేస్తారు. ఇంకా గిరిజనులే అయినప్పటికీ ఇక్కడి ప్రజలు మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారట. అక్కడివారికి ఇలాంటి అలవాట్లేవి ఉండవట.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి.