BSF hands over Pakistani child: భారత సరిహద్దులోకి వచ్చిన మూడేళ్ల బాలుడు.. పాక్‌ సైన్యానికి అప్పగించిన ఆర్మీ

శుక్రవారం రాత్రి 7:15 గంటల ప్రాంతంలో ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో చిన్నారిని భద్రతా బలగాలు గుర్తించినట్లు బీఎస్‌ఎఫ్ తెలిపింది. ఆ చిన్నారి భారత్-పాకిస్థాన్ సరిహద్దు దాటి భారత్ సరిహద్దులోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చేరాడు..

BSF hands over Pakistani child: భారత సరిహద్దులోకి వచ్చిన మూడేళ్ల బాలుడు.. పాక్‌ సైన్యానికి అప్పగించిన ఆర్మీ
Bsf Hands
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2022 | 8:04 PM

Border Security Force: పాకిస్థాన్‌కు చెందిన 3 ఏళ్ల బాలుడు తెలియకుండా భారత సరిహద్దులోకి ప్రవేశించాడు. లోకం తెలియని అమాయకపు బాలుడు అంతర్జాతీయ సరిహద్దు (IB) సరిహద్దును దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు చేరదీశారు. తిరిగి పాకిస్థాన్‌ దేశ సైన్యానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు శనివారం తెలిపాయి. శుక్రవారం రాత్రి 7:15 గంటల ప్రాంతంలో ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో చిన్నారిని భద్రతా బలగాలు గుర్తించినట్లు బీఎస్‌ఎఫ్ తెలిపింది. ఆ చిన్నారి భారత్-పాకిస్థాన్ సరిహద్దు దాటి భారత్ సరిహద్దులోని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చేరాడు..అది చూసిన వెంటనే భద్రతా బలగాలు చిన్నారిని తమ అధీనంలోకి తీసుకున్నారు. పిల్లవాడు తన గురించి ఏమీ చెప్పలేకపోయాడు. దాంతో అతన్ని ఆర్మీ సంరక్షణలో ఉంచుకొని.. ఆ తర్వాత బీఎస్‌ఎఫ్‌ పాక్‌ రేంజర్లను సంప్రదించి.. రాత్రి 9.45 గంటల సమయంలో ఆ బాలుడిని మానవతా దృక్పథంతో అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

చిన్నారి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియనంత వరకు బీఎస్‌ఎఫ్‌ నిఘా ఉంచింది. దీంతో బీఎస్ఎఫ్ పాక్ రేంజర్లను సంప్రదించింది. అప్పుడు తెలిసింది చిన్నారి అనుకోకుండా సరిహద్దు దాటి వచ్చాడని. BSF సుహృద్భావ, మానవతా దృక్పథంతో రాత్రి 9:45 గంటల సమయంలో పాకిస్తాన్ రేంజర్స్‌కి పాకిస్తానీ బిడ్డను అప్పగించింది. దేశ సైనికులు ఇలా ప్రశంసనీయమైన పని చేయడం ఇది మొదటిసారి కాదు. సరిహద్దు దాటే వారికి బీఎస్ఎఫ్ ఎప్పటినుంచో తెలియకుండానే సాయం చేస్తోందన్నారు ఆర్మీ అధికారులు. అనుకోకుండా సరిహద్దు దాటే వారితో బీఎస్‌ఎఫ్‌ ఎల్లప్పుడూ మానవీయణ కోణంలో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి