Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drunken Groom: అక్కతో పెళ్లి.. మరదలితో లొల్లి.. పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ షాక్

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో వెరైటీ కోసం కొందరు వింత చేష్టలకు పాల్పడుతున్నారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి

Drunken Groom: అక్కతో పెళ్లి.. మరదలితో లొల్లి.. పెళ్లి కొడుకు చేసిన పనికి అందరూ షాక్
Drunken Groom
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 02, 2022 | 9:44 PM

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో వెరైటీ కోసం కొందరు వింత చేష్టలకు పాల్పడుతున్నారు. అయితే, తాజాగా ఓ వ్యక్తి తన పెళ్లికి ఫుల్‌గా తాగి వెళ్లాడు. ఎంతగా అంటే మండపంపై స్వయంగా నిలబడి ఉండలేక తూలిపోతున్నాడు. ఆ మైకంలో పెళ్లి కూతురు మెడలో కాకుండా.. పక్కనున్న మరో అమ్మాయి మెడలో దండ వేసేశాడు. దాంతో పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు అంతా షాక్‌ అయ్యారు. ఇక ఆ తరువాత, వరుడికి ఏమి జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం…

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వరుడే మద్యం సేవించి.. తన పెళ్లికి వెళ్లాడు. పెళ్లి మండపంలో కనీసం నిటారుగా నిలబడలేనంతగా ఫుటుగా మందేశాడు. దీంతో అతనికి ఇంకో వ్యక్తి సహాయం చేయాల్సి వచ్చింది. అలాగే వేదికపై వరుడికి మరదలు వరసైన అమ్మాయి దగ్గరుండి అక్కడ ఏర్పాట్లు చూసుకుంటుంది. వధువరులు మార్చుకోవాల్సిన జయమాలను పట్టుకుని వధువు పక్కగా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలో అలా తూగుతున్న పెళ్లికొడుకు మెడలో పెళ్లి కూతురు దండ వేసింది. తర్వాత వరుడు దండ వేయాల్సి ఉండగా.. తూగుతూ వధువు మెడలో కాకుండా పక్కనున్న మరదలి మెడలో వేసేశాడు. దాంతో ఒక్కసారిగా అంతా విస్తుపోయారు. వధువు సైతం జరిగిన ఘటనతో షాక్‌లో ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను bridal_lehenga_designn అనే ఖాతా ద్వారా Instagramలో షేర్‌ చేశారు. దీనిపై చాలా మంది కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.వరుడు చేసిన పనికి నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి