AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: పిల్లికి కోపం వచ్చింది.. యాజమానికి చుక్కలు చూపించింది.. జుట్టు పట్టుకొని లాక్కెల్లి.. చివరకు..

ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో అత్యంత వైరల్ వీడియోలు జంతువులకు సంబంధించినవే ఉంటున్నాయి. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియోలో పిల్లి చేసిన పని చూసిన ప్రతిఒక్కరూ షాక్‌ అవుతున్నారు. అవాక్కై ముక్కున వేలేసుకుంటున్నారు.

viral video: పిల్లికి కోపం వచ్చింది.. యాజమానికి చుక్కలు చూపించింది.. జుట్టు పట్టుకొని లాక్కెల్లి.. చివరకు..
Cat Video
Jyothi Gadda
|

Updated on: Jul 03, 2022 | 4:03 PM

Share

సోషల్ మీడియాలో (Social media) రకరకాల వీడియోలు వైరల్ (viral videos) అవుతుంటాయి. వీటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యకరంగాను ఉంటాయి. ఇక.. జంతువుల ఫన్నీ కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లు వెరైటీ వీడియోలను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఈ పిల్లులు, కుక్కల క్యూట్ వీడియోలు ఎన్ని కనిపించినా, ప్రజలు వాటిని చూడటానికి ఇష్టపడతారు. ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో అత్యంత వైరల్ వీడియోలు జంతువులకు సంబంధించినవే ఉంటున్నాయి. యూజర్లు సైతం జంతువుల కోసం సోషల్ మీడియాలో ప్రత్యేక ఖాతాలను కూడా కలిగి ఉంటారు. వీటిలో కొన్ని ఎమోషనల్ కు గురిచేసేవిలా కూడా ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి వీడియోలు అనేకం నెట్టింట హల్ చల్ చేశాయి. అలాంటి వైరల్ వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌ ప్లాట్‌ఫామ్‌పై నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో పిల్లి చేసిన పనికి వీడియో చూసిన ప్రతిఒక్కరూ షాక్‌ అవుతున్నారు. అవాక్కై ముక్కున వేలేసుకుంటున్నారు. వీడియోలో ఓ పిల్లి ఓ మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చేకెళ్తుంది. ముందుగా పిల్లి నోటిలో పండ్లతో గట్టిగా పట్టుకుని రావటం చూస్తాం. పిల్లి కెమెరా దగ్గరికి రాగానే, అది ఆ మహిళ జడ అని అర్థమవుతుంది. ఆ మహిళ జడను నోట్లో పెట్టుకుని పిల్లి ఆమెను ఈడ్చుకుంటూ వెళుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు. పిల్లికి తిండి పెట్టకపోవడం వల్లే ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. తిండి దొరక్కపోతే ఆ పిల్లి తన యజమానిని వంటగదిలోకి ఇలా లాక్కెళ్లిందని మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి