Funny wedding: పెళ్లిలో వింత ప్రమాణం..! వరుడు చెప్పిన మాటకు అక్కడివారంతా పగలబడి నవ్వుకున్నారు..

Viral Video: పెళ్లికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని పెళ్లిళ్లలో ఫన్నీ మూమెంట్స్ జరగగా మరికొన్ని పెళ్లిళ్లలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. కొందరు వధూవరులు అయితే ఏకంగా పెళ్లి వేదికపై కొట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన కంటెంట్‌ని ప్రజలు బాగా ఇష్టపడటం కూడా దీనికి ఒక కారణం. చాలా సార్లు ప్రజలు వీటిని చూసి […]

Funny wedding: పెళ్లిలో వింత ప్రమాణం..! వరుడు చెప్పిన మాటకు అక్కడివారంతా పగలబడి నవ్వుకున్నారు..
Funny Wedding
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2022 | 5:42 PM

Viral Video: పెళ్లికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్ని పెళ్లిళ్లలో ఫన్నీ మూమెంట్స్ జరగగా మరికొన్ని పెళ్లిళ్లలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. కొందరు వధూవరులు అయితే ఏకంగా పెళ్లి వేదికపై కొట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన కంటెంట్‌ని ప్రజలు బాగా ఇష్టపడటం కూడా దీనికి ఒక కారణం. చాలా సార్లు ప్రజలు వీటిని చూసి నవ్వుకుంటారు, ఆశ్చర్యపోతారు. వధూవరులు తమ వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడానికి రకరకాల పనులు చేస్తూనే ఉంటారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ వైరల్‌ అవుతున్న పెళ్లి వీడియోలో పెళ్లికొడుకు సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వివాహానికి ముందు అనేక ఆచారాలు జరుగుతాయని మనందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఘరాతీ, బారాతీల మధ్య నవ్వులు, జోకులు కూడా సాగుతాయి. అయితే తాజా వైరల్ వీడియో కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ పెళ్లి జరిపించేందుకు వచ్చిన పంతులు..వధూవరులతో పెళ్లి ప్రమాణాలు చేయిస్తున్నాడు. అప్పుడు వరుడు తన కాబోయే భార్యతో చెప్పిన మాటలకు అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వుకున్నారు. పెవిలియన్‌లో పండిట్ జీ వధూవరులను వాగ్దానం చేయడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియలో పురోహితుడు వధువుకు చెబుతాడు..అమ్మ నువ్వు మీ పుట్టింటికి వెళ్లాలనుకుంటే.. తప్పక నీ భర్త అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని,దానికి వెంటనే వరుడు స్పందించాడు. నువ్వు ఎప్పుడైనా వెళ్లు.. కానీ, ఎప్పుడు వెళ్లినా సరే, ఒక నెలరోజులకంటే తక్కువ కాకుండా ఉండు.. అంటూ వధువుకు చెప్పాడు వరుడు. దాంతో అక్కడున్న బంధువులు, స్నేహితులంతా అవాక్కయ్యారు. పందింట్లోని వారంతా పగలబడి నవ్వుకున్నారు.

View this post on Instagram

A post shared by WeddingPlz.com (@weddingplz)

ఈ వీడియోను వెడ్డింగ్‌ప్లిజ్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వార్త రాసే వరకు ఏడు లక్షల మందికి పైగా లైక్ చేశారు. దీంతో పాటు పలువురు దీనిపై సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక వినియోగదారు పురోహితుడి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాహంలో ఇలాంటి వాగ్దానాలు ఎక్కడివంటూ ప్రశ్నించారు. మరో వినియోగదారు స్పందిస్తూ..వరుడి హాస్యం చాలా బాగుంది అని రాశారు. ఇంకా చాలా మంది నెటిజన్లు దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.