Horse Grams Benefits: ఉలవలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాక్ అవుతారు..

ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్లుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు. ఈ ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Horse Grams Benefits: ఉలవలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాక్ అవుతారు..
Horse Grams Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 03, 2022 | 8:28 PM

Horse Grams Benefits : ఉలవలు.. ఈ పేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగువారికి ఉలవలతో తయారుచేసే చారంటే అమితమైన ఇష్టం. దీన్నే ఉలవకట్టు అని కూడా అంటారు. దీని రుచి ఒక్క‌సారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్ట‌రు. అంత‌టి కమ్మదనం ఈ ఉలవకట్టులో ఉంటుంది. ఇక ఉలవలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తరచూ తీసుకోవటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉలవలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఈ ఉలవలను పేదవారు మాత్రమే గుగ్గిళ్లుగానో లేదా చారుగానో చేసుకుని తినేవారు. ఈ ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది.

ఉలవలు ఎదిగే వయసు పిల్లలకు మంచి పోషకాహారంగా పనిచేస్తుంది. ఇవి ఆకలిని పెంచుతాయి. ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండడం వల్ల శ‌రీరానికి చ‌క్కని పోష‌ణ‌ను అందిస్తాయి. ఉలవల్లో ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్రణలో ఉంటాయి. మూత్రంలో మంటతో ఇబ్బంది పడేవారు ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది. దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి బాగుచేసేందుకు తోడ్పడతాయి.

ఇవి కూడా చదవండి

ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు. త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి ఉలవలు మంచి సహాయకారి. కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపి ఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. నెలసరి రెగ్యులర్ గా రాని మహిళలు ఉలవలను తినే ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి.  అయితే ఈ ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన వేడి చేసే గుణం ఉంటుంది. కనుక ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే వేడి చేయదు. మరీ ముఖ్యంగా ఇది వర్షాకాలం కాబట్టి ఉలవలు తింటే ఒంటికి మేలుచేస్తుందంటున్నారు నిపుణులు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!