India – England Match: బెయిర్ స్టో క్యాచ్ అవుట్.. కోహ్లి ఫ్లయింగ్ కిస్.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇండియా - ఇంగ్లండ్ ఐదో టెస్టు (India - England) మూడో రోజు ముగిసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జానీ బెయిర్‌స్టో (106) వద్ద ఔటయ్యాడు. బెయిర్ స్టోను ఔట్ చేసిన వెంటనే కోహ్లీ చేసిన పని సోషల్...

India - England Match: బెయిర్ స్టో క్యాచ్ అవుట్.. కోహ్లి ఫ్లయింగ్ కిస్.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో
Kohli Flying Kiss
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 04, 2022 | 4:47 AM

బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న ఇండియా – ఇంగ్లండ్ ఐదో టెస్టు (India – England) మూడో రోజు ముగిసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జానీ బెయిర్‌స్టో (106) వద్ద ఔటయ్యాడు. బెయిర్ స్టోను ఔట్ చేసిన వెంటనే కోహ్లీ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెయిర్ స్టో (Bairstow) ను ఔట్‌ చేశాక కోహ్లీ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అంతకు ముందు విరాట్ కోహ్లీ, బెయిర్ స్టో మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో అంపైర్లు కలగజేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత బెయిర్ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. దంచికొడుతూ వేగంగా శతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, కాసేపటికే షమి బౌలింగ్‌లో కోహ్లీకి చిక్కాడు. దీంతో కోహ్లీ క్యాచ్‌ అందుకున్న వెంటనే ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.

కాగా.. ఇంగ్లాండ్ – ఇండియా ఐదో టెస్టు మ్యాచ్‌ లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. తద్వారా భారత్‌ 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో పుజారా, పంత్‌ ఉన్నారు. కోహ్లీ(20), శుభ్‌మన్‌ గిల్‌(4), హనుమ విహారి(11) వద్ద ఔట్ అయ్యారు. కాగా అంతకు ముందు ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్‌ అయింది. విరాట్‌ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. బెన్‌స్టోక్స్‌ వేసిన 29.5 ఓవర్‌కు కీపర్‌కు క్యాచ్‌ ఇవ్వగా అది చేజారింది. అయితే, పక్కనే ఉన్న జోరూట్‌ ఆ బంతిని అందుకోవడంతో కోహ్లి పెవిలీయన్ బాటపట్టాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 45 ఓవర్లకు 125/3 గా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!