Rohit Sharma: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నెట్ ప్రాక్టీస్‌లో దర్శమిచ్చిన హిట్ మ్యాన్.. అయితే..
India vs England: క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త. కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పూర్తిగా కోలుకున్నాడు. ఆదివారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో అతనికి నెగెటివ్ అని తేలింది. ఈక్రమంలో కొవిడ్ నెగెటివ్ అని రిపోర్ట్ రాగానే
India vs England: క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త. కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పూర్తిగా కోలుకున్నాడు. ఆదివారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో అతనికి నెగెటివ్ అని తేలింది. ఈక్రమంలో కొవిడ్ నెగెటివ్ అని రిపోర్ట్ రాగానే ప్రాక్టీస్ సైతం మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు తాను రెడీగా ఉన్నాననే సంకేతాలు పంపాడు. ఆదివారం ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చిన రోహిట్ నెట్స్‌లో చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. భారీషాట్లతో పాటు డిఫెన్స్‌వ్ షాట్లు ఆడుతూ ఎంతో ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. ఇది చూసిన హిట్ మ్యాన్ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. ఇక ఇంగ్లిషోళ్లకు దబిడిదిబిడే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఆ రిపోర్టు ఆధారంగానే..
కాగా రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ రిపోర్డు వచ్చినప్పటికీ హిట్‌మ్యాన్‌కు ఇంకో పరీక్ష జరగాల్సింది. సోమవారం గుండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించనున్నారు.. ఆ రిపోర్టు ఆధారంగానే అతను తొలి టీ20 మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడా.. లేదా..? అన్న విషయంపై స్పష్టత వస్తుందని బీసీసీఐ ప్రతినిధులు తెలిపారు. కాగా రోహిత్‌కు ఈ టెస్ట్‌లో నార్మల్ రిపోర్ట్ వచ్చినా మళ్లీ ఫిట్‌నెస్ పరీక్షను సైతం ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇక జులై 7 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య పొట్టి క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. మొత్తం మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆతర్వాత మూడు వన్డేలు జరగాల్సి ఉంది.
Exclusive and Latest video ?
Captain Rohit Sharma is looking in great touch in nets. pic.twitter.com/OsXPZP4r32
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) July 4, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..