Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATA Celebrations 2022: యంగ్ హీరో అడివిశేష్‌ చేతుల మీదుగా టీవీ9USA స్టేషన్‌ రీ లాంచ్‌.. హాజరైన పలువురు ప్రముఖులు..

ATA Celebrations 2022: ఆటా ఉత్సవాల్లో భాగంగా TV9 నెట్‌వర్క్‌ USA స్టేషన్‌ ఐడీని ప్రముఖ యంగ్ హీరో అడివిశేష్‌ (Adivi Sesh) లాంఛ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్ రజనీకాంత్‌, సింగర్‌ సునీతతో పాటు పలువరు ప్రముఖులు, ఆటా నిర్వాహకులు పాల్గొన్నారు.

ATA Celebrations 2022: యంగ్ హీరో అడివిశేష్‌ చేతుల మీదుగా టీవీ9USA స్టేషన్‌ రీ లాంచ్‌.. హాజరైన పలువురు ప్రముఖులు..
Ata Celebrations 2022
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jul 04, 2022 | 11:08 AM

ATA Celebrations 2022: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మహాసభలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నగరంలోని అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ఈ తెలుగు ప్రపంచ పండగకు వేదికగా మారింది. కరోనా కారణంగా రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుపుకుంటున్న ఈ ఉత్సవాల్లో వివిధ రంగాలకు చెందన అతిరథ మహారథులు పాల్గొంటున్నారు. కాగా ఉత్సవాల్లో భాగంగా TV9 నెట్‌వర్క్‌ USA స్టేషన్‌ ఐడీని ప్రముఖ యంగ్ హీరో అడివిశేష్‌ (Adivisesh) లాంఛ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్ రజనీకాంత్‌, సింగర్‌ సునీతతో పాటు పలువరు ప్రముఖులు, ఆటా నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ (Rajanikanth) మాట్లాడుతూ ‘ టీవీ9ది 18 సంవత్సరాల ప్రయాణం. ఇందులో ఎన్నో మజిలీలు, మలుపులు ఉన్నాయి. హైదరాబాద్‌లో పుట్టిన టీవీ9 నెట్‌వర్క్‌ ఇప్పుడు ఆరు భాషలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. తెలుగుగడ్డపై పుట్టి దేశాన్ని ఏలుతున్నందుకు అప్పుడప్పుడు మాకు ఎంతో గర్వకారణంగా అనిపిస్తుంటుంది. అయితే మొత్తం ఈ ప్రాసెస్‌లో టీవీ9 ఇంతకుముందు అడ్‌హక్‌గా ఎన్‌ఆర్‌ఐ యాక్టివీటీస్‌ను ప్రసారం చేసేది. ఇప్పుడు పూర్తిగా రీలాంఛ్‌ చేశాం. ప్రతిరోజు కనీసం 5 గంటల పాటు ప్రవాస భారతీయుల కంటెంట్‌ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అది బతుకమ్మ కావొచ్చు.. సంక్రాంతి సంబరాలు కావొచ్చు. ఆటా కావొచ్చు.. నాటా అవ్వొచ్చు.. తానా ఏదైనా కావొచ్చు. ఇక్కడ జరిగే కమ్యూనిటీ సమావేశాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌, సినిమా వేడుకలేవైనా కవర్‌ చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. అతితక్కువ సమయంలో ది బెస్ట్‌ కంటెంట్‌ను అందించేందుకు కృషిచేస్తాం. టీవీ9 తెలుగును ఎలాగైతే ఆదరించారో టీవీ9 USAని కూడా అలాగే ఆదిరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. త్వరలోనే న్యూజెర్సీలో హెడ్‌క్వార్టర్‌ ప్రారంభించి అన్ని కార్యకలాపాలు మొదలుపెడతాం. టీవీ9 USA స్టేషన్‌ లాంఛ్‌లో అన్ని విధాలా సహకరించినందుకు ఆటా నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఇదే సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ భువనేశ్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఆటా మహాసభల్లో టీవీ9 USA స్టేషన్‌ లాంఛ్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. యూఎస్‌ఏ కార్యకలాపాలతో పాటు ఆటాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను టీవీ9 USA కవర్‌ చేయాలని కోరుకుంటూన్నాను’ అంటూ టీవీ9 యాజమాన్యానికి బెస్ట్‌ విషెస్‌ చెప్పారు. ప్రసంగాల అనంతరం న్యూజెర్సీ, అట్లాంటా, లాస్‌ఏంజిల్స్‌కు చెందిన టీవీ9 ప్రతినిధులను అందరికీ పరిచయం చేశారు టీవీ9 తెలుగు మేనేజింగ్‌ ఎడిటర్ రజనీకాంత్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి