Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RaviShastri-Bumra: బుమ్రా ప్రపంచ రికార్డ్‌.. బూమ్‌ బూమ్‌ ఇన్నింగ్స్‌కు రవిశాస్త్రి ఫిదా..

RaviShastri-Bumra: బుమ్రా ప్రపంచ రికార్డ్‌.. బూమ్‌ బూమ్‌ ఇన్నింగ్స్‌కు రవిశాస్త్రి ఫిదా..

Anil kumar poka

|

Updated on: Jul 05, 2022 | 9:17 AM

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. మొదట బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన బుమ్రా ఆ తర్వాత


ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. మొదట బ్యాట్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన బుమ్రా ఆ తర్వాత బంతితోనూ చెలరేగాడు. దీంతో ఆతిథ్య జట్టు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇక రెండో రోజు ఆటలో హైలెట్‌ అంటే బుమ్రా బూమ్‌ బూమ్‌ ఇన్నింగ్స్‌. ఎక్కువగా బంతులతోనే బ్యాటర్ల భరతం పట్టే ఈ ఫాస్ట్‌ బౌలర్‌ రెండో రోజు ఆటలో తన బ్యాట్‌ పవర్‌ను కూడా ప్రత్యర్థులకు రుచి చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో బుమ్రా దంచికొట్టడంతో మొత్తం 35 పరుగులు వచ్చాయి. దీంతో టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు బ్రియాన్‌ లారా, బెయిలీ, కేశవ్‌ మహారాజ్‌.. ఒకే ఓవర్‌లో 28 పరుగులు చేశారు. కాగా బుమ్రా ఇన్నింగ్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ కోచ్‌ రవిశాస్త్రి బుమ్రా మెరుపు ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. ఈ మేరకు బీసీసీఐ పంచుకున్న వీడియోలో శాస్త్రి మాట్లాడుతూ ఇది ఎవరూ ఊహించి ఉండరని అభిప్రాయపడ్డాడు.‘ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌ లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు వచ్చినప్పుడు నేను ప్రతి బంతిని క్షుణ్ణంగా చూశాను. కానీ ఇది ఇంకా నిజమని నమ్మలేకపోతున్నా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఒక స్పెషలిస్టు బ్యాటర్ వల్ల కానిది బుమ్రా చేసి చూపించాడు. పదోస్థానంలో వచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యువీ 36 పరుగులు చేయడం, నేను కూడా 36 పరుగులు చేయడం పక్కన పెడితే.. ఈ రోజు నేను చూసింది అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం. క్రికెట్‌లో ఈ పాటికే మీరు అన్నీ చూశామని అనుకోవచ్చు. కానీ, మీరింకా విద్యార్థి అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చూడాల్సింది చాలా ఉందని గ్రహించాలి. ఏదో ఒక రోజు ఇంతకన్నా మెరుగైన రికార్డు మీరు చూస్తారు. ఈరోజు నేను చూసింది కూడా అలాంటిదే’ అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 05, 2022 09:17 AM