AHA OTT: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. గుళ్టు సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Gultoo Movie: సినీ ప్రియులకు 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (AHA OTT). వివిధ భాష్లలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేయడంతో పాటు..
Gultoo Movie: సినీ ప్రియులకు 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (AHA OTT). వివిధ భాష్లలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేయడంతో పాటు సస్పెన్స్ థ్రిల్లంగ్ వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తోంది. ఇక అన్‌స్టాపబుల్, ఇండియన్ ఐడల్ లాంటి గేమ్ షోస్, సింగింగ్ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈక్రమంలో మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. అదే కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన గుళ్టు. కన్నడ యువ నటుడు జనార్దన్ చిక్కన్న ప్రధాన పాత్రలో నటించడంతో పాటు కథ, దర్శకత్వ బాధ్యతలను పర్యవేక్షించారు. సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రానుంది. జులై 8 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా టీమ్ గుళ్టు తెలుగు ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘ఆకలి కడుపులకు ఆశలెక్కువ. విశాలంగా పెరిగే మనసు, రోజు రోజుకీ పరిస్థితులకు లొంగిపోయి, కనీసం చిన్న చిన్న ఆశలకు కూడా చోటు లేనంతగా ముడుచుకుపోతుంది’ అన్న సంభాషణలతో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. వివిద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమాలో నవీన్ శంకర్, సోను గౌడ, అవినాశ్, రఘు, పవన్ కుమార్ తదితరులు నటించారు.