Ramcharan: చెర్రీ, శంకర్‌ సినిమాపై క్రేజీ అప్డేట్‌.. ఏకంగా 1200 మందితో యాక్షన్‌ రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌..

RC 15: సాధారణంగా శంకర్‌ సినిమాల్లో భారీతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పాటలు, పోరాట దృశ్యాలు ఎంతో రిచ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రస్తుతం ఆయన మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ ..

Ramcharan: చెర్రీ, శంకర్‌ సినిమాపై క్రేజీ అప్డేట్‌.. ఏకంగా 1200 మందితో యాక్షన్‌ రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌..
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 6:37 PM

RC 15: సాధారణంగా శంకర్‌ సినిమాల్లో భారీతనం, నిండుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పాటలు, పోరాట దృశ్యాలు ఎంతో రిచ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి.  ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ ( Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన గత సినిమాల్లాగే చెర్రీ చిత్రాన్ని కూడా రిచ్‌గానే తెరకెక్కిస్తున్నారు శంకర్. భారీ సెట్టింగులు, హంగులతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.  ఇందులో భాగంగా ప్రస్తుతం పంజాబ్‌ లొకేషన్స్‌లో రామ్‌చరణ్, కియారాలపై దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్‌ ను షూట్ చేశారట . గణేష్‌ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లోనూ ఈ పాట చిత్రీకరణ కొనసాగనుందట. జులై 10లోపు ఈ పాటను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట శంకర్.

1200 మందితో రిస్కీ ఫైట్..

ఇక ఈ పాట పూర్తి కాగానే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను శంకర్‌ ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ యాక్షన్‌ సీన్‌లో దాదాపు 1200 మంది ఫైటర్లు పాల్గొంటారట. సుమారు 20 రోజుల పాటు ఈ రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేస్తున్నారని సమాచారం. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్‌ 75 శాతం పూర్తవుతుందట. ఆ తర్వాత షెడ్యూల్‌ కోసం విదేశాలకు వెళ్లనుందట. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ 95 శాతం పూర్తవుతుందని తెలుస్తోంది.  ఈ సినిమాలో అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..