AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaali Documentary: కాళీ మాత సినిమా పోస్టర్ వివాదం.. డైరెక్టర్‏కు షాకిచ్చిన ట్విట్టర్..

ఇప్పటికే దేశంలోని పలు చోట్ల డైరెక్టర్ లీనా పై కేసులు నమోదయ్యాయి. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అయితే కాళీ మాత సిగరెట్ పట్టుకోవడంలో తప్పేముందని హిందుత్వ సంఘాలను తిరిగి ప్రశ్నిస్తున్నారు లీనా.

Kaali Documentary: కాళీ మాత సినిమా పోస్టర్ వివాదం.. డైరెక్టర్‏కు షాకిచ్చిన ట్విట్టర్..
Kaali Documentary
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jul 06, 2022 | 6:37 PM

Share

డైరెక్టర్ లీనా మణిమేకల దర్శకత్వం వహిస్తున్న కాళీ(Goddess Kali) డ్యాక్యూమెంటరీ పై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ డాక్యూమెంటరీ నుంచి కాళీ మాత పోస్టర్ విడుదల కావడంతో అందులో కాళీ చేతిలో సిగరెట్ ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. అమ్మవారి చేతిలో సిగరెట్ ఉండడం ఏంటీ అంటూ డైరెక్టర్ లీనా పై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల డైరెక్టర్ లీనా పై కేసులు నమోదయ్యాయి. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అయితే కాళీ మాత సిగరెట్ పట్టుకోవడంలో తప్పేముందని హిందుత్వ సంఘాలను తిరిగి ప్రశ్నిస్తున్నారు లీనా. కాళీ మాత పోస్టర్‌పై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ లీనాకు ట్విట్టర్ షాకిచ్చింది. కాళీ మాత సినిమా పోస్టర్‌ వివాదంలో డైరెక్టర్‌ లీనాపై ట్విట్టర్‌ చర్యలు తీసుకుంది. లీనా చేసిన కాళీ మాత్ పోస్టర్ ట్వీట్‌ను ట్విట్టర్‌ తొలగించింది. కాళీ మాతను అవమానించిందని.. ఆ పోస్టర్ తో హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ఆమె చేసిన పోస్ట్ ను బ్లాక్ చేయాలని ప్రభుత్వం ట్విట్టర్ సంస్థను ఆదేశించింది. దీంతో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. లీనాకు సంబంధించిన ట్వీట్ జూలై 5 నుంచి కనిపించడం లేదు.

అయితే తన ట్వీట్ డెలిట్ పై డైరెక్టర్ లీనా ఇంకా స్పందించలేదు. ఆమె ప్రస్తుతం కెనడాలో ఉంటున్నారు. ఆమెకు తమిళనాడులో సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇప్పటికే అనేక డాక్యుమెంటరీలకు లీనా దర్శకత్వం వహించింది. ఆమె చేసిన ఎన్నో డాక్యుమెంటరీలు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్