AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Tej: మునుపెన్నడూ కనిపించని సరికొత్తలో పాత్రలో వరుణ్‌.. లుక్‌ మార్చే పనిలో మెగా హీరో..

Varun Tej: హాలీవుడ్ హీరోను తలదన్నే ఫిజిక్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సొంతం. అయితే వరుణ్‌ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో అతని ఫిజిక్‌, హైట్‌ తగ్గట్లున్న పాత్రలు కొన్నేనని చెప్పాలి కంచెలో సైనికుడిగా, గణిలో బాక్సింగ్ ప్లేయర్‌గా తప్ప..

Varun Tej: మునుపెన్నడూ కనిపించని సరికొత్తలో పాత్రలో వరుణ్‌.. లుక్‌ మార్చే పనిలో మెగా హీరో..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jul 06, 2022 | 6:37 PM

Share

Varun Tej: హాలీవుడ్ హీరోను తలదన్నే ఫిజిక్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సొంతం. అయితే వరుణ్‌ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో అతని ఫిజిక్‌, హైట్‌ తగ్గట్లున్న పాత్రలు కొన్నేనని చెప్పాలి కంచెలో సైనికుడిగా, గణిలో బాక్సింగ్ ప్లేయర్‌గా తప్ప మిగతా సినిమాల్లో లవర్‌ బాయ్‌, మాస్‌ హీరో రోల్స్‌లోనే నటించాడు. ఇక ఎఫ్‌2, ఎఫ్‌3తో తనలోని కామెడీని టైమింగ్‌ను సైతం ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే తాజాగా వరుణ్‌ తన బాడీ లాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యే పాత్రలో కనిపించనున్నాడు వరుణ్‌ తేజ్‌.

ఎఫ్‌2 సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కనుంది. షూటింగ్ మెజారిటీ శాతం లండన్‌లోనే జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ మాత్రం రాలేదని చెప్పాలి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ అంతర్జాతీయ ఏజెంట్‌ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

కెరీర్‌లో తొలిసారి గూఢచారి పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతోన్న వరుణ్‌ అందుకు తగ్గట్లుగా తన లుక్‌ను మార్చుకునే పనిలో పడ్డట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో యాక్షన్స్‌ సీన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానుంది. ప్రవీన్‌ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ‘గరుడ వేగ’ కూడా ఇలాంటి కథాంశంతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో వరుణ్‌ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్