Deepika Padukone: పెళ్లి తరువాత రొమాంటిక్ సీన్స్‌ చేయకూడదా ?.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్..

పెళ్లి తర్వాత కూడా దీపికా రొమాంటిక్ సినిమాల్లో నటించడం ఏంటీ అంటూ నెటిజన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా తాను సినిమాలు చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది దీపికా.

Deepika Padukone: పెళ్లి తరువాత రొమాంటిక్ సీన్స్‌ చేయకూడదా ?.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్..
Deepika Padukone
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2022 | 7:15 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దీపికా పదుకోణె (Deepka Padukone) క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లి తర్వాత కూడా దీపికా జోరు కొనసాగిస్తోంది. వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ఈ చిన్నది. అయితే వివాహం తర్వాత కూడా రొమాంటిక్ చిత్రాల్లో ఆమె నటించడం పై భిన్న రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి తర్వాత కూడా దీపికా రొమాంటిక్ సినిమాల్లో నటించడం ఏంటీ అంటూ నెటిజన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా తాను సినిమాలు చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది దీపికా.

గతంలో హీరోయిన్‌కు పెళ్లి అయితే కెరీర్‌ ముగిసిపోయేది. మహా అయితే సపోర్టింగ్ రోల్స్‌లో కంటిన్యూ అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ జనరేషన్ హీరోయిన్లు.. పర్సనల్ లైఫ్‌, ప్రొఫెషనల్‌ కెరీర్‌ వేరు వేరని ప్రూవ్ చేస్తున్నారు. ఈ విషయంలోనే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హాట్ కామెంట్స్ చేశారు.

పెళ్లైన హీరోయిన్లను తెర మీద చూసి మేల్‌ ఈగో హర్ట్ అవుతుందని సీరియస్ కామెంట్స్ చేశారు దీపికా పదుకొనే. పెళ్లి తరువాత కెరీర్‌లో మరింత బిజీ అయిన ఈ నేషనల్ బ్యూటీ… తన మూవీ సెలక్షన్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. పెళ్లి తరువాత రొమాంటిక్ సీన్స్‌లో నటించటం గురించి కూడా ఓపెన్‌గా రియాక్ట్ అయ్యారు దీపిక.

ఇవి కూడా చదవండి

పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా నేను దీపికా పదుకొనేనే. అలాంటప్పుడు పెళ్లైందని నేను చేసే మూవీస్‌ మాత్రం ఎందుకు మారాలి అన్నది దీపిక క్వశ్చన్‌. అయినా తెర మీద తాను ఇంటిమేట్ సీన్స్ చేయటం విషయంలో తన భర్త రణవీర్‌కు లేని అభ్యంతరం మిగతా వారికి ఏంటి అన్నది ఈ బ్యూటీ వర్షన్‌. ప్రొఫెషనల్ కెరీర్‌ వేరు.. పర్సనల్ లైఫ్ వేరు.. రెండు కలిపి చూడొదని సజెషన్ ఇస్తున్నారు దీపిక.

రణవీర్ కూడా ఇండస్ట్రీ పర్సనే కావటంతో దీపికను పూర్తిగా అర్ధం చేసుకుంటారట. అందుకే ఆఫ్టర్ మ్యారేజ్‌ కూడా తాను అన్ని రకాల సినిమాలు ఫ్రీగా చేయగలుగుతున్నా అని చెబుతున్నారు ఈ అందాల భామ. మరి దీపిక ఇచ్చిన క్లారిటీతో ఆడియన్స్‌ కన్విన్స్ అవుతారా..? లేదా ? అన్నది చూడాలి.