- Telugu News Photo Gallery Cinema photos Do you know Allu Arjun has these many plants both in his office and house?
Allu Arjun: పచ్చని భూమిని నెక్స్ట్ తరానికి ఇద్దాం.. మొక్కలునాటి .. వాటి ఫోటోలు షేర్ చేయమని ఫ్యాన్స్ కు బన్నీ పిలుపు
Allu Arjun: జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన అభిమానులకు ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ చెట్లను నాటాలని కోరాడు
Updated on: Jul 06, 2022 | 1:03 PM

అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు గొప్ప పర్యావరణవేత్త కూడా. అల్లు అర్జున్ తన ఇల్లు, ఆఫీసుని మొత్తం మొక్కలతో నింపేశాడు. సుమారు 100 రకాల మొక్కలను పెంచుతున్నాడు బన్నీ.

మొక్కలు, చెట్లు, వనమూలిక మొక్కలను పెంచడం అంటే అల్లు అర్జున్‌కి ఇష్టం. ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు మొక్కలు బహుమతిగా ఇస్తాడు.. తనకు ఎవరైనా మొక్కలను బహుమతిగా ఇస్తే.. ఇష్టంగా వాటిని తీసుకుంటాడు. ఇప్పటివరకు తనకు బహుమతిగా ఇచ్చిన ప్రతి మొక్కనూ ఎంతో కేరింగ్ గా పెంచుతున్నాడు అల్లువారబ్బాయి..

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. బన్నీ తన మొక్కకు నీళ్ళు పోస్తున్న చిత్రాన్ని పంచుకున్నాడు.. "ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరం మరిన్ని చెట్లను నాటుదామని తెలిపాడు. పర్యావరణ అనుకూలమైన అలవాట్లకు అలవాటు పడుతూ.. ప్రకృతి మన కోసం ఏమి చేస్తుందో అర్ధం చేసుకుని అభినందిద్దాం.. అందమైన ప్రకృతిని తయారు చేద్దాం. భూమిని నెక్స్ట్ తరానికి పచ్చని ప్రదేశంగా అందిద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకుని మొక్కలను పెంచాలని కోరుతున్నానని చెప్పాడు అల్లు అర్జున్. అంతేకాదు మీరు ఒక మొక్కను నాటుతున్న ఫోటోను షేర్ చేయండి.. వాటిలో కొన్నింటిని మళ్లీ తను షేర్ చేస్తానని.. అభిమానులకు పిలుపునిచ్చాడు. మనంభూమిని కాపాడేందుకు కలిసి పని చేద్దామని.. #GoGreenWithAA ఫ్యాన్స్ ని కోరాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ , రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్ (2021) విజయం తర్వాత, అందరి దృష్టి ఇప్పుడు సీక్వెల్‌పై ఉంది. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రెండవ భాగం నిర్మాణాన్ని ప్రారంభించడంలో సుకుమార్ జాప్యం చాలా చర్చకు దారితీసింది. మేకర్స్ ఇప్పుడు షూటింగ్ పార్ట్ షెడ్యూల్ చేసే పనిని మొదలుపెట్టారు. ఈ వార్త సినీ అభిమానులకు ఊరటనిస్తోంది

పుష్ప: ది రూల్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సుకుమార్ సెకండ్ పార్ట్ ను ఆగస్టులో షూటింగ్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుకుమార్ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బంది ఎదుర్కోవడంతో స్క్రిప్ట్ వర్క్ లెట్ అయినట్లు తెలుస్తోంది.

పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాలలోని అభిమానులను మాత్రమే కాదు.. దేశవిదేశాల అభిమానులను అలరించింది. అర్జున్ .. పుష్ప గా తన నటనతో అలరించాడు. పుష్ప 2లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.





























